‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు

Published Fri, May 5 2017 1:37 AM

‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు - Sakshi

స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధన తొలగింపు
సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ గురువారం తెలిపిం ది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్‌/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్‌/ స్పోర్ట్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధనను తొలగించింది. బీపీఈడీ చేసిన అభ్యర్థులకు  స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధనను తొలగించింది.

నిర్ణీత మార్కులు కలిగిన డిగ్రీతో పాటు బీపీఈడీ ఉంటే సరిపోతుంది. 40% మార్కులతో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్‌/3 ఏళ్ల బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించింది. ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిగ్రీ అభ్యర్థులకు నిర్ణీత విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్‌/గేమ్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధననూ తొలగించింది. క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టుల్లో నిర్ణీత విభాగాల్లో టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ) చేసిన వారికి, ఆర్ట్‌ టైలరింగ్‌ ఎంబ్రాయిడరీలో వొకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ చేసిన వారికి, టీసీసీ లోయర్‌ చేసిన వారికి అవకాశం కల్పించింది. పోస్టులన్నింటికి 1999 జూలై 1 తర్వాత పుట్టినవారు, జనరల్‌ అభ్యర్థులు 1973 జూలై 2కు ముందు జన్మించిన వారు అర్హులు కాదు. తెలుగు, హిందీ, ఉర్దూ టీజీటీ, పీజీటీ పోస్టుల స్క్రీనింగ్‌ టెస్టు తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

Advertisement
Advertisement