స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

Published Tue, Aug 5 2014 2:10 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

 రాంనగర్ :తెలంగాణ ఉత్సవాలు నిర్వహించిన తరహాలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతి సాహిత్యం ప్రతిబింబించేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, హరితహారం కార్యక్రమాలపై స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పొందుపర్చాలని చెప్పారు. వివిధ అభివృద్ధి సంక్షేమ శాఖలు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు.
 
 ఏజేసీ, జెడ్పీ సీఈఓలు సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ అధికారులను, సిబ్బందిని అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో 30 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించేలా డీఈఓ, డీపీఆర్‌ఓ, వ్యవసాయశాఖ జేడీ కమిటీలో ఎంపిక చేసిన ప్రదర్శనలు మాత్రమే ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఏర్పడక ముందే మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 6వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో, పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని చెప్పారు.
 
 ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలతో పాటు మండలస్థాయి కార్యాలయాలలోనూ, అదే విధంగా 11గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజు వేడుకలకు అధికారులు హాజరుకావాలనిఆదేశించారు. ఈ నెల 19న తేదీన జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామి పథకం క్షేత్ర సహాయకులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వయోజన విద్య కోఆర్డినేటర్లు, వీఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జాబితాలను ఈ నెల 7వ తేదీ వరకు సిద్ధం చేసి 11వ తేదీన మండలస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్నారు.
 
 పర్యవేక్షక అధికారులందరూ తమకు కేటాయించిన మండలాలకు వెళ్లి వార్డులు, గ్రామాలలో ఇంటింటికి వేసిన నోషనల్ నంబర్లను పరిశీలించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 1176 నోడల్ అధికారులను, 210 వార్డులకు మరో 210 నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కుటుంబ యజయాని రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, గ్యాస్ నంబరు, పింఛను, వయస్సు ధ్రువీకరణ, వికలాంగ ధ్రువీకరణ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్, కరెంట్ మీటర్, ఇతర వివరాలతో 19వ తేదీన సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి హైదరాబాద్ వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ విషయంలో ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement