ఇందిరమ్మ ఇళ్ల స్కాంపై ఛార్జ్ షీట్ | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 7:57 PM

Indiramma Housing Scam CID Charge Sheet Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇందిరమ్మ ఇళ్ల స్కాంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు నిర్మించారన్న దానిపై  స్పష్టత  కోరుతూ విజిలెన్స్‌ అధికారులకు ఓ లేఖ రాసింది. 9 జిల్లాల్లో 36 గ్రామాల్లో 3 వేల ఇళ్ల నిర్మాణాల్లో భారీగా గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు విజిలెన్స్ నివేదిక రాగానే ఛార్జీషీట్‌ దాఖలు చేయనున్నారు.

మూడు వేల ఇళ్ల నిర్మాణాల్లో దాదాపు 11 కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement