27 లేదా 28న ఇంటర్‌ ఫలితాలు! | Sakshi
Sakshi News home page

27 లేదా 28న ఇంటర్‌ ఫలితాలు!

Published Fri, Apr 7 2017 2:50 AM

inter results 27th OR 28TH

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఈనెల 27 లేదా 28న విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మార్చి 1న ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 8న ప్రారంభమైన స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దీంతో ఫలితాల విడుదల పనులను చేపట్టేందుకు బోర్డు సిద్ధమవుతోంది.

Advertisement
Advertisement