రానున్న మూడు నెలలు కీలకం... | Sakshi
Sakshi News home page

రానున్న మూడు నెలలు కీలకం...

Published Fri, Jun 20 2014 12:47 AM

రానున్న మూడు నెలలు కీలకం...

  •    ఒకపక్క పండుగలు,మరోపక్క  ఉమ్మడి రాజధాని భద్రత
  •      అప్రమత్తమైన జంట పోలీసు కమిషనర్లు
  • సాక్షి, సిటీబ్యూరో: రానున్న మూడు నెలలు పోలీసులకు సవాల్‌గా మారనున్నాయి. ఒకపక్క వరుసగా వస్తున్న ఇరువర్గాల పండుగలు.., మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రతా చర్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ రానున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

    ఇటీవల జరిగిన రాజేంద్రనగర్, మౌలాలి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న వీరు మరింత జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే వీరు అదనపు పోలీసు కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, డీసీపీల నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో వేర్వేరుగా సమీ క్ష సమావేశాలు నిర్వహించారు.  నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పోలీసులపై మరింత పని భారం పెరిగింది. దీంతో పాటు మూడు నెలల్లో రంజాన్, బోనాలు, బక్రీద్, వినాయక ఉత్సవాలు రానున్నాయి.

    వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.  రెండు కమిషనరేట్లలో సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. వారితోనే ప్రణాళికాబద్ధంగా బందోబస్తు నిర్వహిస్తే మంచి ఫలి తాలు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల మౌలాలిలో జరిగిన మత ఘర్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మ ల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డిని కమిషనర్ ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

    ఇలాంటి  ఘ టనలు పునరావృత్తం కాకుండా ఇన్‌స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మతఘర్షణలు జ రిగితే మొదటి వేటుపడేది సంబంధిత స్టేషన్ ఇన్‌స్పెకర్‌పైనే అని ‘మల్కాజిగిరి’ ఘటన ద్వారా అందరికీ తె లిసింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇన్‌స్పెక్టర్లు ఉదయం 8 గంటలకే ఠాణాకు వచ్చి కూర్చుంటున్నారు. బస్తీలు, కాలనీలలో జరిగే ప్రతి అం శాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు.
     
    మైత్రీ కమిటీలపై చూపు....
     
    ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా సులభంగా పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు మైత్రీ, శాంతి కమిటీలపై దృష్టి పెట్టారు. ప్రతీ ఠాణాలో ఉన్న ఈ కమిటీలున్నా.. కొన్ని చోట్ల పని చేయడంలేదు.  కమిటీలను పునరుద్ధరించి రాబోయే రోజుల్లో ఏదైనా సమస్యలు వస్తే వాటి సహకారంతోనే పరిష్కరించాలని పోలీసు కమిషనర్లు భావిస్తున్నారు.  మైత్రీ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఠాణాల ఇన్‌స్పెక్టర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పరిధిలో బుధవారం నుంచి మైత్రీ,శాంతి కమిటీలతో పోలీసులు సమావేశాలు ప్రారంభించారు.  

    వారం రోజుల్లో సమావేశాలు పూర్తి చేసి భద్రతపై దృష్టి పెట్టనున్నారు. ఇక నగరంలో మాత్రం మైత్రీ సంఘాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడ కూడా మొదలు కానున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, దానికి ఆనుకున్న ప్రాంతాలపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరించారు. సైబరాబాద్‌లోనైతే మూడు నెలల పాటు ఏకంగా 144 సెక్షన్‌ను విధించారు.
     
    సెలవులు కరవే...
     
    వరుస పండుగల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి రానున్న మూడు నెలల్లో ఎలాంటి సెలవులు లభించే అవకాశంలే దు.  సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే... ఇక ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు ఠాణాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.  సిబ్బంది సంఖ్యను పెంచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురంటున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల కోసం కేంద్రం నుంచి అదనపు బలగాలు ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న బలగాలతోనే బందోబస్తును నెట్టుకొస్తుండటంతో  సివిల్ పోలీసులపై అధిక పనిభారం పడింది.
     

Advertisement
Advertisement