డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ గజ్జెల కాంతం

28 Oct, 2017 09:53 IST|Sakshi

సాక్షి, కరీంనరగ్‌ : కరీంనగర్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు  బ్రీత్‌ అనలైజర్‌లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  గజ్జెల కాంతంకు మద్దతుగా కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. పోలీసులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు గజ్జెల కాంతంను అదుపులోకి తీసుకుని కాసేపటికి వదిలి పెట్టారు. పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

పోలీసులతో వాగ్వాదానికి దిగిన గజ్జెల కాంతం 

మరిన్ని వార్తలు