కొరడా ఝులిపిస్తున్న జగిత్యాల కలెక్టర్‌

19 Sep, 2019 12:25 IST|Sakshi
కొండగట్టు: ముత్యంపేట సమీక్ష సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ శరత్‌

పది రోజుల్లో ముగ్గురి సస్పెన్షన్‌.. ఒకరి బదిలీ

ఎనిమిది మందికి షోకాజ్‌ నోటీస్‌లు 

పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక అమలు

సాక్షి, కోరుట్ల:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముప్పై రోజుల ప్రణాళికలో నిర్లక్ష్యంపై వేటు తప్పడం లేదు. ముప్పై రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్‌ శరత్‌ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వేటు వేస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రణాళిక అమలును పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో అక్కడ చేస్తున్న పనులు, గ్రామస్తుల భాగస్వామ్యం, అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. 

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. నాలుగు రోజుల క్రితం మెట్‌పల్లి మండలం వెల్లుల కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండ లంలో ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయడమే కాకుండా.. మరో కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా తహసీల్దార్‌ను బదిలీ చేశారు. ఈ చర్యలతో జిల్లావ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్‌ శరత్‌ ఎంత సీరియస్‌ ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. పది రోజుల వ్యవధిలో ముగ్గురు కిందిస్థాయి సిబ్బంది సస్పెన్షన్‌కు గురవడంతో అధికారులు మరింత పకడ్బందీగా పనుల్లో నిమగ్నమయ్యారు.   

తనిఖీలు.. సమీక్షలు 
జిల్లావ్యాప్తంగా 30 రోజల ప్రణాళిక అమలులో లోటుపాట్లు లేకుండా కలెక్టర్‌ శరత్‌ ఎప్పటికప్పు డు అన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, అ ధికారులతో సమీక్షలు చేస్తున్నారు. గ్రామాలలో సమూల మార్పులు రావాలన్న లక్ష్యంతో  30 రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని 18 మండ లాల్లోని 380 గ్రామపంచాయతీల్లో చురుకుగా సాగుతున్నాయి. ప్రణాళిక అమలుకు 379 గ్రా మాల్లో 1,137 మంది కో–ఆప్షన్‌ సభ్యులు, 380 స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రా మానికి ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ శరత్‌ ఇప్పటికే జిల్లాలోని సగం మండలాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక తీరుతెన్నులపై సమీక్షలు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రణాళిక అమలులో ఎక్కడెక్కడ లోపాలున్నాయనే దానిపై తనిఖీలు చేసి చ ర్యలు తీసుకుంటున్నారు. అలసత్వం వహిస్తు న్న అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పది రోజుల వ్యవధిలో 30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సస్పెన్షన్‌కు గురికాగా.. 8 మంది సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతోంది. 

ఇంటలిజెన్స్‌ కన్ను 
జిల్లాలో పది రోజులుగా సాగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలు తీరు తెన్నులపై ఇంటలిజెన్స్‌ నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా ఇంటలిజెన్స్‌ అధికారులు గ్రామపంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అ మలు ఎలా ఉంది.. ఏ మేరకు అధికారులు, ప్ర జాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉందన్న అంశంలో రోజువారీ ప్రగతి నివేదికలను ఉన్న తాధికారులకు అందిస్తున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయన్న విషయంలో ఇంటలిజెన్స్‌ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నివేదికలు జిల్లా ఉన్నతాధికారులకు చేరుతుండగా వీటి ఆధారంగా జిల్లాలో 30 రోజుల ప్రణాళిక అమలులో వెనకబడ్డ మండలాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. మిగిలిన పది రోజుల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు మరింత నిక్కచ్చిగా వ్యవహరించే అవకాశాలున్నాయడంలో సందేహం లేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు