కళ్లు తెరవకుంటే మాల్యా గతే | Sakshi
Sakshi News home page

కళ్లు తెరవకుంటే మాల్యా గతే

Published Wed, Mar 29 2017 2:41 AM

కళ్లు తెరవకుంటే మాల్యా గతే - Sakshi

రాష్ట్రం అప్పుల కోసం ఆదాయం పెంచి చూపింది
మేం చెప్పిందే కాగ్‌ నివేదికలో పొందుపరిచింది: జానారెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ఆదా యాన్ని పెంచి చూపించారని కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి విమర్శించా రు. పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, టి.జీవన్‌రెడ్డితో కలసి మంగళవారమిక్కడ ఆయన విలేకరుల తో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ ఆదాయం కంటే అప్పులు ఎక్కువయ్యాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే విజయ్‌మాల్యాకు పట్టిన గతి పట్టే ప్రమాదం ఉంది. అప్పు తెచ్చి మోటారు సైకిళ్లపై విహారాలు చేయడం మంచిది కాదు. ప్రభుత్వ ఖజానాకు వాస్తవంగా వస్తున్న ఆదా యం, అంచనాలు,వినియోగం వంటి వాటిపై స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.

వీటిలోని వాస్తవాలను ప్రభుత్వం అంగీకరించకుంటే కాగ్‌ బయటపెడుతుందని చెప్పిన మాటలు నిజమయ్యాయి. వాస్తవాలకు భిన్నంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని కాగ్‌ చెప్ప డంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తేట తెల్లమైంది’’ అని జానారెడ్డి అన్నారు. 2015–16 బడ్జెట్‌లో నిబంధనలకు విరుద్ధం గా రాబడిగా వచ్చిన రూ.4,215 కోట్ల నిధులు మురిగిపోయాయన్నారు. బడ్జెట్‌పై చర్చలో రాబడికి, ఖర్చుకు మధ్య దాదాపు రూ.8 వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తోందని అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు హెచ్చరించారన్నారు. ఇదే విషయాన్ని కాగ్‌ కూడా గుర్తించి, హెచ్చరిం చిందన్నారు. లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకు న్న రుణాలను కూడా ఖజానాలో వేసుకుని, రాబడులుగా చూపించారని విమర్శించారు.

భ్రమల్లో ఉంచుతున్నారు...
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం 2015–16లో ఖర్చు చేయాల్సిన మొత్తంలో కేవలం 49 శాతం మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన వాటిని 2016–17లో ఖర్చు చేశారని జానా చెప్పారు. 2016–17కు సంబంధించిన ఒక్కపైసా కూడా వినియోగించకుండా, ఆ వర్గాలను భ్రమల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా వాస్తవాలను పక్కదారి పట్టించే లా సీఎం మాట్లాడారన్నారు. ప్రతిపక్షాల సూచనలను పట్టించుకోకుంటే అవి ప్రజాం దోళనలుగా మారే ప్రమాదముందన్నారు. కాంగ్రెస్‌ ఎప్పటినుంచో చెబుతున్న అంశా లను ఇప్పుడు కాగ్‌ వెల్లడించిం దని షబ్బీర్‌ అలీ చెప్పారు. ఎక్సైజ్‌ శాఖలో తప్ప దేని లోనూ ఆదాయం రావడం లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement