ప్రైవేట్ పాఠశాలలపై కొరడా ఝులిపిస్తారా ? | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ పాఠశాలలపై కొరడా ఝులిపిస్తారా ?

Published Tue, Jun 17 2014 3:41 AM

Jhulipistara whip private schools?

  •     నగరంలో ప్రైవేటు పాఠశాలల తనిఖీకి కమిటీలు
  •      8 ప్రత్యేక బృందాల ఏర్పాటు
  •      కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • విద్యారణ్యపురి : విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే జిల్లావ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ సమస్యను వివిధ విద్యార్థి సంఘాలతోపాటు, ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు కూడా జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎల్‌కేజీ మొదలుకుని టెన్త్ క్లాస్ వరకు కూడా పలుపాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

    అంతేగాక విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ డొనేషన్లు కూడా వసూలు చేస్తున్నారు. మరోవైపు కొన్నింట్లో యూనీఫామ్‌లు, పుస్తకాలు, షూలు మొదలుకొని ఇతర వస్తువులు కూడా విక్రయిస్తున్నారు. విధిగా పాఠశాలలోనే వాటిని కొనుగోలు చేయాలని షరతు విధిస్తుండడంతో తల్లిదండ్రులు విధిలేక వేలల్లో డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.
     
    వరంగల్ నగరంలోని వివిధ పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టెన్త్ అడ్మిషన్‌కైతే రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసే పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అధిక ఫీజులను నియంత్రించాలని కలెక్టర్ కిషన్ కూడా జిల్లా విద్యాశాఖాధికారులను ఇటీవల ఆదేశించారు. ్రైపైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తున్నాయా ? లేదా ? ఫీజుల స్ట్రక్చర్ ఎలా ఉంది ? వసతులు ఏమేరకు ఉన్నాయో తదితర అన్ని అంశాలను పరిశీలించాల్సింది కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ డాక్టర్ ఎస్. విజయకుమార్ ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు మొదట వరంగల్ డి విజన్ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీ చేయాలని అందుకు 8 కమిటీ బృందాలను నియమించారు.
     
    మూడు హైస్కూళ్లను తనిఖీ చేసిన డీఈఓ
     
    విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక డీఈఓ ఎస్. విజయకుమార్ సోమవారం తనిఖీలు ప్రారంభించారు. వర్ధన్నపేట, రాయపర్తి మండలంలోని మైలారం, తొర్రూరులోని జెడ్పీ సూళ్లను డీఈఓ విజయకుమార్ తనిఖీచేశారు. ఆయా ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలకు పలు సూచనలు చేసినట్లు డీఈఓ  వెల్లడించారు. గత విద్యాసంవత్సరం తనిఖీలతో హడలెత్తించిన డీఈఓ మళ్లీ ఈ విద్యాసంవత్సరం కూడా తానే స్వయంగా మళ్లీ పర్యవేక్షణ మొదలెట్టారు.
     
     తనిఖీ కమిటీల బృందాలు ఇవే..
     
    వరంగల్ డిప్యూటీ డీఈఓ డి.వాసంతి, తరాలపల్లి పీజీహెచ్‌ఎం రాంధన్, జిల్లాపరిషత్ డిప్యూటీ డీఈఓ నరేందర్‌రెడ్డి, మర్కజీ హైస్కూల్ పీజీ హెచ్‌ఎం ఇ దేవేందర్‌రెడ్డి, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి పీజీహెచ్‌ఎం జి.లింగారెడ్డి, జనగామ డిప్యూటీ డీఈఓ రేణుక, పీజీహెచ్‌ఎం రఘునందన్‌రెడ్డి, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, హెచ్‌ఎం ఎల్.వెంకట్‌రెడ్డి, ములుగు డిప్యూటీ డీఈఓ కృష్ణమూర్తి, హెచ్‌ఎం రాంచంద్రారెడ్డి ,డైట్ లెక్చరర్లు ఎం సోమయ్య, సోమశేఖర్‌రెడ్డి, సీటీఈ ప్రభుత్వ లెక్చరర్ వేణుగోపాల్, పీజీహెచ్‌ఎం సుబ్బారావు ఉన్నారు. ఒక్కో కమిటీలో ఇద్దరు చొప్పున ఉండి తనిఖీ చేయబోతున్నారు. అయితే ఏ మేరకు ఫీజులను నియంత్రిస్తారోననేది చర్చగా ఉంది.
     

Advertisement
Advertisement