గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం!

24 Mar, 2018 03:47 IST|Sakshi

త్వరలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం: జూపల్లి

సర్పంచ్‌ల అధికారాలు,బాధ్యతలు పెంచుతున్నాం

ప్రస్తుత సమావేశాల్లోనే బల్లు పెడతామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ సర్పంచ్‌ల అధికారాలు, బాధ్యతలతోపాటు పంచాయతీలకు నిధులు పెంచుతూ కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. శాసనసభలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్‌ పద్దులపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు.  

శాసనసభ్యుల గృహాలు సిద్ధం: తుమ్మల
రాష్ట్ర శాసనసభ్యుల కోసం నిర్మించిన 120 గృహాల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల కోసం 44 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు.

800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రం
కొత్తగూడెం 720 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నా యని విద్యుత్‌ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు.  

తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం
శాసనసభ శుక్రవారం ఆర్‌అండ్‌బీ, నీటిపారు దల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పురపాలక, రెవెన్యూ, రవాణా, ఎౖMð్సజ్‌ శాఖల బడ్జెట్‌ పద్దులకు ఆమోదం తెలిపింది.  

మరిన్ని వార్తలు