‘జూరాల- పాకాల’ సమ్మతమేనా? | Sakshi
Sakshi News home page

‘జూరాల- పాకాల’ సమ్మతమేనా?

Published Mon, Jan 19 2015 4:16 AM

‘జూరాల- పాకాల’ సమ్మతమేనా?

నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి
 
వనపర్తిరూరల్ : జిల్లా నుంచి 70 టీఎంసీల నీటి ని తీసుకువెళ్లేందుకు రూపకల్పన చేసి న జూరాల-పాకాల ప్రాజెక్టుకు అంగీకరించావా? అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నిరంజన్‌రెడ్డి ఆధారలతో సహా ప్రజల ముందుకొచ్చి తాను నె ట్టెంపాడుపై రాసిన వ్యాసం చూపించాలన్నారు. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆదివారం వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు.

వ్యవసాయం బాగుండాలనే ఉద్దేశంతో దివంగత సీ ఎం వైఎస్‌ఆర్ హయాంలో రూ.7469. 37కోట్ల నిధులతో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 90శాతం పనులు చేయించిన ఘనతఆయనకే దక్కిందన్నారు. తెలం గాణ మొదటి బడ్జెట్‌లో ఎంజీఎల్‌ఐ, కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టుల పాత బకాయి బిల్లుల చెల్లింపులకు కేసీఆర్ బడ్జెట్‌లో కేవలం రూ. 310 కోట్లు వెచ్చించడం శోచనీయమన్నారు.

పెద్దాయనే బతికిఉంటే జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిచేసుకుని జిల్లా సస్యశ్యామం అయ్యేదని గుర్తుచేశారు. జూరాల- పాకాల పేరుతో జిల్లాలో ఉన్న ఏకైక ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని, నెట్టెంపాడు ప్రాజెక్టు సామర్థ్యం 40 టీఎంసీలకు పెంచి ఆ తరువాతే జూరాల- పాకాలకు సిద్ధంకావాలని సూచించారు. కాదని పూనుకుంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
 
ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం సరికాదు
 జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ పర్యటన కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించాల్సి ఉండేదని, అందరితో కలిసి జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తే బాగుండేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. మెమోరాండం సిద్ధం చేసుకున్న తరువాత కేవలం మహబూబ్‌నగర్ టౌన్ వారు ఆహ్వానితులని చెప్పడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ శంకర్‌నాయక్, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement