బీసీ విద్యార్థులకు అన్యాయం: కె.లక్ష్మణ్‌ | Sakshi
Sakshi News home page

బీసీ విద్యార్థులకు అన్యాయం: కె.లక్ష్మణ్‌

Published Thu, Nov 16 2017 4:06 AM

K. Laxman Speech on Student Fee Reimbursement Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. బుధవారం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ..  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దాటవేసే దోరణి అవలింబించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఫీజు బకాయిలు పెరిగిపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదని అన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా తమ సిబ్బందికి జీతాలను ఇచ్చే పరిస్థితులు లేవని తెలిపారు. తక్షణమే ఫీజు బకాయిలను  చెల్లించాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement