విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష

Published Tue, May 9 2017 12:25 PM

విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష - Sakshi

హైదరాబాద్‌ : అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం ప్రణాళిలకపై  ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఎడ్యుకేషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌, అన్ని జిల్లాల డీఈవోలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచాలని, బడిబాట కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. చాలామంది డీఈవోలకు విధులపై సరైన అవగాహన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే పదో తరగతి ఫలితాలను విశ్లేషించుకుని వచ్చే ఏడాది మరింత మెరుగు చేసుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. జూన్‌లోనే అన్ని పాఠశాలలకు నిధులతో పాటు, మెయింటనెన్స్‌ గ్రాంట్స్‌ అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement