ఓరుగల్లుకు ‘హృదయ్’ కిరీటం | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు ‘హృదయ్’ కిరీటం

Published Thu, Jan 22 2015 1:09 AM

Kakatiya art to its former glory

కాకతీయుల కళలకు పూర్వ వైభవం
ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్
రూ. 40.54 కోట్ల నిధుల మంజూరుకు  {ధువీకరణ పత్రం జారీ

 
 వరంగల్ అర్బన్ :  కాకతీయ కళలకు పూర్వ వైభవం రానుంది. చారిత్రక, పర్యాటక సంపదకు కొత్త శోభ సంతరించుకోనుంది. తెలంగాణ లో చారిత్రక ప్రాంతంగా విలసిల్లుతున్న వరంగల్‌కు ‘హృదయ్’ కిరీటం దక్కింది. ఈ మేరకు ఓరుగల్లుకు రూ. 40.54 కోట్ల నిధు ల మంజూరు ధ్రువీకరణ పత్రం జారీకావడం విశేషం. వివరాలి లా ఉన్నాయి. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ‘హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ అగ్నెంటేషన్ యోజన(హృదయ్)’ పథకా న్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 12 నగరాలకు చెందిన ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్.. ఓరుగల్లు విశిష్టతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వరంగల్ గతంలో ఏకశిల నగరంగా, ఓరుగల్లుగా, కీర్తి పొందిన కాకతీ యుల రాజధానిగా విలసిల్లిందన్నారు. 12 నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఓరుగల్లు కేంద్రంగా వ్యాప్తిచెందిన కాకతీయుల సామ్రాజ్యం, చారిత్రక సంపదను ఆయన వివరించారు.

కాగా, కమిషనర్ అందజేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు నిశితంగా వీక్షించారు. ఈ మేరకు ‘హృదయ్’కు వరంగల్‌ను ఎంపిక చేస్తూ నిధుల మంజూరు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. కాగా, ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, కుడా పీఓ  అజిత్‌రెడ్డి, బల్దియా ఎస్‌ఈ అబ్దుల్ రహమాన్, ఇన్‌చార్జ్ సీటీప్లానర్ కోదండరాంరెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ రవీంద్రనాథ్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ కల్చరల్ హెరిటే జ్(ఇంటాక్) కన్వీనర్ ఎం. పాండురంగారావు పాల్గొన్నారు.

రూ.40.54 కోట్ల మంజూరుకు ధ్రువీకరణ పత్రం జారీ..

హృదయ్‌లో భాగంగా తొలిదశగా వరంగల్‌కు రూ.40.54 కోట్ల నిధుల మంజూరు ధ్రువీకరణ పత్రాన్ని అందచేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఎం పీ శ్రీహరి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. కాగా, ఈ నిధుల్లో రూ.35 కోట్లతో చారిత్రక, వారసత్వ సంపద ఆధునీకరణ, కళావైభం, రూ. 2కోట్లతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారీకి వెచ్చించనున్నారు. మిగిలిన రూ.3 కోట్లతో ఇతర మౌలిక వసతులకు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
 
చారిత్రక కట్టడాల అభివృద్ధి..

 హృదయ్ పథకంతో జిల్లాలోని వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి గుడి, పద్మాక్ష్మి దేవాలయం, భట్టుపల్లిలోని ఫణిగిరి  రా మప్ప దేవాలయం అభివృద్ధి చెందనున్నాయి. అలాగే ఓరుగల్లు కోట, కుష్‌మహాల్, కాజీపేట దర్గా, హన్మకొండలోని జైన మం దిరం, కాజీపేటలోని ఫాతిమా చర్చి, వనవిజ్ఞాన కేంద్రం, మ్యూ జికల్ గార్డెన్లకు మహర్దశ పట్టనుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement