రైతులపై కేసీఆర్ చిన్నచూపు | Sakshi
Sakshi News home page

రైతులపై కేసీఆర్ చిన్నచూపు

Published Sun, Jun 28 2015 2:43 AM

KCR contempt for farmers

 మంచిర్యాల సిటీ: జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ సమస్య అ త్యవసరమని తెలిసి కూడా, సీఎం కేసీఆర్ దశలవారీగా రుణాలను రద్దుచేయడాన్ని  బట్టి  ఆ యనకు రైతులపై ఉన్న చిన్నచూపును అర్ధం చేసుకోవచ్చన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే ఉచిత విద్యుత్‌తో పాటు, రుణమాఫీ దస్త్రాలపై సంత కం చేసిన విషయూన్ని తెలంగాణ రైతులు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.  
 
 జిల్లాలోని ప్రతి రైతు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. విద్యార్థుల భోధన రుసుములను ఒకేసారి చెల్లించకుండా పేదవారు చదువులకు దూరమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  జిల్లా సమస్యలపై దశలవారిగా ఉద్యమాలు చేసి ప్రజలకు తమ పార్టీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయనతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ థామస్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు జాన్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా నాయకులు నరేందర్, జమీల్‌బాబా,  ఉన్నారు.
 
 మిషన్ కాకతీయతో ఫలితం శూన్యం  
 జన్నారం:  ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా రైతులకు జరుగుతున్న లబ్ధి శూన్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆ రోపించారు. శనివారం జన్నారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.   పథకం కింద జిల్లాలో ఎంపికైన చెరువుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నా రు.బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలన్నారు.  పార్టీకి పూర్వవైభవం తెస్తాం జిల్లాలో వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం వస్తుందని అనిల్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిల అధ్యక్షతన జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి పట్టణాలలో పార్టీ క్యాడర్‌ను పెంచామన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, అధికార ప్రతినిధి చంద్రయ్య, మండల అధ్యక్షుడు రాజునాయక్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement