సారూ.. నాపై నిర్లక్ష్యమేలా..? | Sakshi
Sakshi News home page

సారూ.. నాపై నిర్లక్ష్యమేలా..?

Published Mon, Aug 17 2015 1:55 AM

సారూ.. నాపై నిర్లక్ష్యమేలా..? - Sakshi

కోటి రతనాల తెలంగాణ తొలిసారి సీఎం కేసీఆర్ గారు.. తొలిసారి వుుఖ్యవుంత్రి హోదాలో మా నియోజకవర్గంలో సోమవారం పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే పర్యాటక, ఆహ్లాదకరమైన ప్రాంతంగా నాకు విదేశీయుులు ఎనమిదోస్థానం కల్పించారు. మనదేశంలో రెండోస్థానం నాదే. మీరు ఏలుతున్న రాష్ట్రంలో నేనే నంబర్‌వన్. మీరు వుుఖ్యవుంత్రి అయ్యూక జూరాల నీటిని తెచ్చి నాకు వురింత గుర్తింపు తెస్తారని ఆశించా. ఆలస్యమైనా ఓర్చుకుంటున్నా.  పాకాల సరస్సు అనే నేను.. సవుస్త జీవరాశికి కల్పతరువును. నా చుట్టూ ఎత్తై గుట్టలు, పచ్చని చెట్లు, వాటి వుధ్య జీవితాలను అల్లుకున్న ప్రాణకోటికి అవసరమైన అంతులేని ఔషధ మొక్కలు. నిజం చెప్పాలంటే నేనే ప్రకృతిని.నీటిని..కూటిని..!! నాలో ఈదులాడే చేపపిల్ల.. దాని కోసం జపం చేసే కొంటె కొంగ.. ఆడఈడ మేసి ఆకలి వేయుగా దప్పిక తీర్చుకునేందుకు నా వద్దకు వచ్చే పశువుల వుంద.. నాలో ఉన్న చెట్లపై గూడు కట్టుకున్న పిచ్చుకల కిలకిలలు.. సహజ జీవన సౌందర్యం.. అలనాటి కాకతీయు రాజులు ఒక ప్రణాళిక ప్రకారం నాకు ప్రాణం పోశారు.

 ప్రపంచ సరస్సుల్లో దేశంలోనే రెండవ స్థానం
 వుుందే చెప్పినట్లు నీను ప్రకృతి ప్రతిరూపాన్ని...నాలో నీళ్ళు..వాట్లో చేపపిల్లలు ఉన్నారుు. అటవీ ప్రాంతంలో నివసించే వన్యప్రాణుల దప్పిక తీర్చుకునేందుకు ఏకైక దిక్కును.. చెరువు కట్టపై వానర సైన్యం సందడి..చెట్లపై కోరుులలు, చిలుకలు, గొర్రెంకలు, గిజిగాళ్ళు, పాలపిట్టలు, గువ్వలు లాంటి పక్షులు చేసే సందడి అంతా..ఇంతా కాదు. నీళ్లలో ఉన్న చెట్ల కొవ్ములకు వేలాడే గూళ్ళు కట్టే పచ్చపిట్టల అందాలను, వాటి కిలకిలారివాన్ని చెప్పనలవి కాదు. వడ్ల పిట్ట తన వాడి వుుక్కుతో చెట్ల కొవ్ములను తొలిచే చప్పుడు వినితీరాల్సిందే..ఎక్కడో వాటేడి తెచ్చుకున్న ఎరను నా తావుకు వచ్చి తినే గద్దలు, డేగలు, కాకుల సంగతి సరేసరి..ఇదే కాదండోయ్ నా వద్దకు వచ్చే పర్యాటకులందరికి సుగందపు వాసనలను వెదజల్లుతాను కూడా.
.
 బాధపడుతున్నా..
 ఇన్ని అద్భుతాలు నాలో ఇమిడి ఉన్నారుు. వీటిని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులను పూర్తి సంతృప్తి పర్చకపోవడంతో బాధపడుతున్నా. 1980లో నా చెంతన ఒక పార్కు ఉండేది..అందులో వివిధ రకాల జంతువుల ఉండే వి.. అప్పట్లో సందడి ఉండగా పర్యాటకులు ఆనందపడేవారు. 1985లో దాన్ని తొలగించడంతో దుఖిఃచాను. ఏళ్ల తరబడి కాసిన్ని డబ్బులు కేటారుుంచి నా వద్ద సౌకర్యాలు కల్పించి చూడాల్సిన వారు లేరు. అందుకే వుుఖ్యవుంత్రి మీరైనా నా అందాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు నా పరిధిలో సౌకర్యాలు కల్పించి, సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నా..
 ఇట్లు
 మీ పాకాల సరస్సు
 - నర్సంపేట
 

Advertisement
Advertisement