సీల్డుకవర్‌లో జడ్పీ చైర్మన్?! | Sakshi
Sakshi News home page

సీల్డుకవర్‌లో జడ్పీ చైర్మన్?!

Published Sat, Jul 5 2014 1:35 AM

kcr sending zp chairman candidate name in sealed cover

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై ఎవరు? అనే చర్చకు శనివారం తెరపడనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సీల్డుకవర్‌లో జడ్పీ చైర్మన్ అభ్యర్థి పేరును పంపినట్లు తెలిసింది. ఇంతకాలం గా గుంభనంగా వ్యవహరిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ శుక్రవా రం సాయంత్రమే ఓ నిర్ణయాని కి వచ్చినట్లు తెలిసింది. జడ్పీ చై ర్మన్ ఎన్నికల ప్రక్రియ మొదల య్యే అరగంట ముందే అభ్యర్థులను వెల్లడించే విధంగా ఏర్పా ట్లు చేసినట్లు సమాచారం.

 అప్పటి వరకు జడ్పీ చైర్మన్, వైస్ చై ర్మన్‌లుగా ఎంపికయ్యే అభ్యర్థు ల పేర్లు సీల్డుకవర్‌లోనే భద్రం గా ఉండనున్నాయి. బీసీ జనరల్‌కు కేటాయించిన జడ్పీ పీఠంపై కలలుగంటున్న జడ్పీటీసీ సభ్యులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా.. చివరకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అనేక కోణాల్లో సమీక్ష, సమాలోచనలు జరిపిన పిదప కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

 ఆశావహుల్లో టెన్షన్...
 మేయర్, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీల ఎన్నికలను ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేసిన ఆయన జడ్పీ చైర్మన్ విషయంలో తానే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పినట్లు కూడా పార్టీలో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి జడ్పీ రేసులో జిల్లాలో నలుగురు జడ్పీటీసీ సభ్యులున్నా.. చివరి వరకు ఇద్దరి పేర్లనే పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి జడ్పీటీసీ సభ్యుడు హరాలే తానాజీరావు, నిజాంసాగర్ జడ్పీటీసీ దఫెదారు రాజులలో ఎవరో ఒకరికి దక్కవచ్చంటున్నారు.

 కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు జడ్పీటీసీ సభ్యుడు నంద రమేష్  సైతం ప్రయత్నంలో ఉన్నామంటున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి మద్నూరు జడ్పీటీసీ సభ్యుడు బస్వరాజ్ పేరు కూడా తెరపైకి రావడం జడ్పీటీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జడ్పీ వైస్ చైర్మన్ పదవిని మహిళలకు కట్టబెట్టాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ అధిష్టా నం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 ఇదే నిజమైతే ధర్పల్లి జడ్పీటీసీ సుమన, మోర్తాడ్ జడ్పీటీసీ అనితలలో ఒకరికీ జడ్పీ వైస్ చైర్మన్ అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇదిలా వుంటే ప్ర చారం జరగుతున్న విధంగా చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న వీరిలో ఎవరికైనా ఇస్తారా, లేక నిజామాబాద్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల్లో జరిగిన విధంగా అనూహ్యంగా కొత్త వ్యక్తిని తెరమీదకు తెస్తారా? అన్న చర్చ కూడ జరుగుతోంది.

 మూడోసారి..
 జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు 24 కైవసం చేసుకు న్న టీఆర్‌ఎస్ మూడోసారి ఇందూరు జడ్పీపై శనివారం గులా బీ జెండా ఎగుర వేయనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు జడ్పీ పీఠాన్ని అధిష్టించిన టీఆర్‌ఎస్ మూడోసారి ఆ పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించనుంది. కాగా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా జిల్లా పరిషత్ పీఠం మరోసా రి బీసీలకు కేటాయించారు. 1995 తర్వాత మరోసారి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీలకు రిజర్వు అయ్యింది. జడ్పీకి 1995 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియలో చైర్మన్లను ఎన్నుకుం టుండగా.. 1995లో బీసీ జనరల్‌కు, 2001, 2006లలో వరుసగా జనరల్‌కు రిజర్వు కాగా... ఈసారి బీసీ జనరల్‌కు దక్కింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా టీఆర్‌ఎస్‌నే అదృష్టం వరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement