రాష్ట్రం బాగుపడాలన్నదే ధ్యేయం | Sakshi
Sakshi News home page

రాష్ట్రం బాగుపడాలన్నదే ధ్యేయం

Published Fri, Dec 15 2017 3:08 AM

kcr on telnagana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రాష్ట్రం బాగుపడా లన్నదే తమ ధ్యేయమని, సానుకూల అభి వృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ జరగా లని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగ స్వామ్యం కోసం ఉమామాధవరెడ్డి, ఆమె తనయుడు సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. గురువారం టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌ రెడ్డి తమ అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ఉమా మాధవరెడ్డి చేరికతో సొంత ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంద న్నారు. ‘‘1985లో నేను, మాధవరెడ్డి ఒకే సారి ఎమ్మెల్యేలం అయ్యాం. అనేక ఏళ్లు కల సి పనిచేశాం. తెలంగాణకు నిధులు రాక పోతే నేను, మాధవరెడ్డి కలసి వెళ్లి నిధుల కోసం సీఎంతో కొట్లాడేవాళ్లం..’’అని కేసీఆర్‌ చెప్పారు. నాటి సీఎం చంద్రబాబు కరెంట్‌ చార్జీలు పెంచినపుడు తాను, మాధవరెడ్డి కూడా చివరికంటా వ్యతిరేకించామన్నారు.

వారికి ఉన్నత అవకాశాలు ఉంటాయి..!
నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రు లయ్యారని.. కానీ జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డేనని కేసీఆర్‌ అన్నారు. సంస్కా రం ఉన్న కుటుంబం దూరంగా ఉందన్న బాధ ఉండేదని, ఇప్పుడు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ఉమామాధవ రెడ్డి, సందీప్‌రెడ్డికి మంచి భవిష్యత్‌ ఉంటుం ది. సందీప్‌రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉంది. రాజకీయాల్లో ఎవరికెప్పుడు, ఏ అవ కాశం వస్తుందో చెప్పలేం. ఈ రోజుల్లో ఓపిక తక్కువగా ఉంటోంది. టీఆర్‌ఎస్‌లో చేరేం దుకు ఉమామాధవరెడ్డి నా ముందు ఎలాంటి డిమాండ్‌ పెట్టలేదు. వారికి పార్టీలో ఉన్నత అవకాశాలుంటాయి..’’ అని చెప్పారు.

భేదాభిప్రాయాలు వద్దు
రాజకీయాలు సర్వసాధారణమని, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. పాత, కొత్త నేతలు అన్న భేదాభిప్రాయం లేకుండా అంతా కలసి పనిచేయాలని.. మంత్రి జగదీశ్‌రెడ్డి సమన్వయం చేయాలని సూచించారు. నల్లగొండ (పాత) జిల్లాకు రెండు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశామని, భువనగిరి వరకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతీ రాథోడ్, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement