Sakshi News home page

'మోదీ కేబినెట్పై టీఆర్ఎస్ కన్నేసింది'

Published Tue, Mar 3 2015 2:13 PM

'మోదీ కేబినెట్పై టీఆర్ఎస్  కన్నేసింది' - Sakshi

హైదరాబాద్ : నరేంద్ర మోదీ కేబినెట్లో చేరేందుకు టీఆర్ఎస్ తహతహలాడుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.  కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరాలనుకుంటోంది కాబట్టే  బడ్జెట్లో తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నా  ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఆయన మంగళవారమిక్కడ మండిపడ్డారు.

ఓవైపు  ప్రత్యేక హైకోర్టు కావాలంటూ న్యాయవాదులు ఉద్యమిస్తున్నా కేసీఆర్  పట్టించుకోవడం లేదని పొన్నం ఆరోపించారు.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో  బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను  ఓడిస్తామని న్యాయవాదులు హెచ్చరించాలన్నారు.  

అప్పుడే రెండు పార్టీలు  దిగొస్తాయని  పొన్నం అన్నారు. చెప్పారు. న్యాయవాదులు బుధవారం చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంతో పాటు, టీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఆయన సూచించారు మరోవైపు పీసీసీ  చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి  నియామకంపై హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని పొన్నం తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement