పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు | Sakshi
Sakshi News home page

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Published Mon, Mar 13 2017 3:44 PM

key directions of high court for police recruitment

హైదరాబాద్‌: పోలీస్ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం 63 మార్కులు వచ్చిన హోంగార్డుకు ఓపెన్‌ కేటగిరీలో  ఉద్యోగం ఇవ్వటాన్ని తప్పుపట్టింది. దీనిపై అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ 14ఎఫ్‌ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులిచ్చామని చెప్పారు.  పిటిషనర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు క్లారిఫై ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎంపికైన ఈ హోంగార్డు విషయం తేలేవరకు 188 మంది హోంగార్డుల అపాయింట్‌మెంట్‌ ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. జిల్లా వారీ ఏబీసీడీ కేటగిరీల  నిబంధనల మేరకు ఎలా అపాయింట్‌మెంట్‌ చేపట్టారో రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని తెలిపింది. ఒకవేళ రిక్రూట్‌మెంట్‌ సక్రమంగా జరగలేదని కోర్టు భావిస్తే నోటిఫికేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ ఛైర్మన్ పూర్ణచందర్‌రావు హైకోర్టుకు హాజరయ్యారు.

Advertisement
Advertisement