శ్రీరామ దివ్యక్షేత్రంలో లక్ష దీపాల వెలుగు | Sakshi
Sakshi News home page

శ్రీరామ దివ్యక్షేత్రంలో లక్ష దీపాల వెలుగు

Published Fri, Nov 14 2014 3:42 AM

Lakh deepotsava in bhadrachalam

భద్రాచలం: శ్రీరామ దివ్యక్షేత్రం లక్ష దీపాలతో దే దీప్యమానంగా వెలిగింది. రామాలయం, స్వామి వారి కల్యాణ మండప ప్రాంగణమంతా గురువారం భక్తులతో కిటకిట లాడింది. బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో భద్రాచలంలో తొలసారిగా జరిగిన ఈ అరుదైన వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో తాము కూడా  ఒక దీపాన్ని వెలిగించాలని భక్తులు ఎంతో ఆసక్తి కనబరిచారు.

 లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భద్రాచలం ఆర్‌డీవో ఆర్. అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వారు దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కల్యాణ మండపంలో దీపాలను వెలిగించారు.  దీపాలంకరణలో పాల్గొనేందుకు మొత్తం 76 గ్రూపులు పేర్లను నమోదు చే యించుకోగా  వీరిలో 24 గ్రూపులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు.

ఆర్‌డీవో, ఈవో, ఫౌండేషన్ ైచె ర్మన్ చేతుల మీదగా లాటరీ ప్రక్రియను పూర్తయ్యింది. ఎంపికైన గ్రూపులలోని  భక్తులంతా వారికి కేటాయించిన సెక్టార్లలోకి వెళ్లి దీపాలంకరణ చేశారు. కార్తీక మాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  గర్భగుడి ప్రాంగణం, రాజగోపురం ఎదుటగా భక్తులు వెలిగించిన దీపాలతో రామాలయం దేదీప్యమానంగా కనిపిం చింది.

 ఆకట్టుకున్న దీపాలంకరణలు
 కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో భాగంగా కల్యాణ మండప ప్రాంగణంలో మహిళలు చేసిన దీపాలంకరణ లు ఆకట్టుకున్నాయి. పిల్లలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా దీపాలంకరణలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. దీపాలంకరణ నడుమ దేవుళ్ల రూపాన్ని అమర్చటంతో, అందంగా పూలతో వాటికి అలంకరణ చేశారు.

వర్షంతో ఏర్పాట్లకు కొంత ఆటంకం కలిగినప్పటికీ భక్తి భావంతో ఉన్న మిహ ళలు ఇవేమీ లెక్కచేయకుండా దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి, కెప్టెన్ చౌదరి, ఫౌండేషన్ మేనేజర్ కపిల్, ఏఈవో శ్రావణ్ కమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు శివానంద ఆశ్రమం వారు ముద్రించిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 భద్రాద్రి ఆలయాభివృద్ధికి సహకారం
 భద్రాచలం రామాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ అన్నారు. భద్రాచలం పౌరసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని జీయర్ మఠంలో సురేంద్రకుమార్‌కు  పౌర సన్మానం చేశారు.  పట్టణ ప్రముఖులు ఆయన్ను ఘనంగా సత్కరించారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి రామయ్యపై తనకు ఉన్న భక్తిభావంతోనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు, లిటిల్‌ఫ్లవర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యం, యోగి సూర్యనారాయణ, సర్పంచ్ భూక్యా శ్వేత, అడుసుమిల్లి జగదీష్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement