Sakshi News home page

మళ్లీ కాంగి‘రేసు’

Published Wed, Aug 27 2014 3:22 AM

Leaders decision after matho madhanam

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మేథో మథనంలో జిల్లా కాంగ్రెస్ నేతలు కీల కంగా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మార్గ నిర్దేశం మేరకు సభ్య త్వ సేకరణ స్పెషల్‌డ్రైవ్‌ను సెప్టెంబర్ మొదటి వా రంలో మొదలెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజల స మస్యలపై ఉద్యమాలు నిర్వహించడం ద్వా రా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మేధోమథనం తర్వాత టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పలు సూ చనలు చేసింది.

 సెప్టెంబర్ మొద టి వారంలో బూత్‌లెవెల్ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూ చించింది. నాయకులు, కార్యకర్తల మనోధైర్యం దె బ్బ తినకుండా ఉండేందుకు డీసీసీ అధ్యక్షునికి తోడు మాజీ మంత్రులలో ఒకరికి జిల్లా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు పి. సుదర్శన్‌రెడ్డి, డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీలో ఎవరో ఒకరు కో-ఆర్డినేటర్ బాధ్యతలను భుజాన వేసుకునే అవకాశం ఉంది.

 సెప్టెంబర్‌లో మొదలయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని హైకమాండ్ సూచించింది. డిసెంబర్ మొదటి వారంలో బూత్ కమిటీల నుంచి జిల్లా కమి టీ అధ్యక్షుల వరకు అన్ని స్థాయిలలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాలని పేర్కొంది. 2015 జనవరిలో రాష్ట్ర నేతను ఎన్నుకునేందుకు సిద్ధం కావాల ని అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు కోసం కాం గ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.

 ఇపుడిపుడే తేరుకుంటూ
 సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలితాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా రు. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల లో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ గౌడ్, సురేష్‌కుమార్ షెట్కార్ ఓటమి చెందారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నుంచి వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శాసనమండలి పక్ష నేతగా మళ్లీ చురుకయ్యారు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మా జీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి మేధోమథనంలో భవి ష్య త్ కార్యాచరణపై అధిష్టానానికి పలు సూచనలు చేశా రు. మాజీ విప్ ఈరవత్రి అనిల్ తదితరులు సైతం ఓటమిని మరచి పార్టీ కార్యక్రమాల వైపు కదులుతున్నారు.  రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల లో ఘోర పరాజయంపై ‘పోస్టుమార్టం’ నిర్వహించి  న నేతలు, ఇక అధిష్టానం ఆదేశాల అమలుకు సిద్ధమవుతున్నారు.

 గ్రూపుల మధ్య సయోధ్య కుదిరేనా!
 ఇంతవరకు బాగానే ఉన్నా, జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపుల పోరుకు ఇకనైనా తెరపడుతుందా? అన్న చర్చ కూడ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాలలో నేత లు కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. డీఎస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ పలు సందర్భాలలో గ్రూపుల పోరును తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement