మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
ప్రభుత్వ నిర్ణయాలు ముందే మీడియాకు తెలిస్తే ఎలాగని ఆగ్రహం
రుణ మాఫీపై మెలికలు పెట్టరాదని కేబినెట్ భేటీలో నిర్ణయం
హైదరాబాద్: రుణ మాఫీపై రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో జరిగిన చర్చల వివరాలు మీడియాలో రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నో సమస్యలుంటాయని, వాటిపై అంతర్గతంగా జరిగే చర్చలను బయటకు పొక్కనీయొద్దని హితవు పలికారు. కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలోని సి-బ్లాక్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు రెండుగంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రుణ మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. లక్ష రూపాయల్లోపు పంట రుణాలను ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థూలంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎలాంటి మెలికలు పెట్టినా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు, సాంకేతికాంశాలను తెలుసుకుని ఆ మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా, రైతుల రుణమాఫీ విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తింపజేస్తామంటూ మీడియాలో వచ్చిన వార్తలకు కారణం ఎవరంటూ సీఎం ఈ సందర్భంగా అందరినీ నిలదీసినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ సలహాదారుల్లోనే ఒకరు ఈ లీకులు చేశారని ఓ మంత్రి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి లీకులు వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు. ఎవరు లీకులు ఇస్తారో, ఎవరికి ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. లీకులు ఎవరు ఇచ్చినా సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోకుంటే జాగ్రత్త అని తీవ్ర స్వరంతో అన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను అధికారికంగా చెప్పేదాకా ఆగకుండా బయట పెడితే రుణమాఫీపై తలెత్తిన పరిస్థితులే ఎదురవుతాయని కేసీఆర్ వివరించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మీడియాలో జరిగిన ప్రచారంతో ఆత్మహత్యలు, ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. నిర్ణయం ఏదైనా తీసుకోవడానికి ముందుగా ఎన్నో చర్చలు జరుగుతాయని, అవన్నీ మీడియాలో ఎందుకు రావాలని కేసీఆర్ తన సహచరులను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా, రాష్ర్ట అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల అమలుపై వేయబోయే అడుగులు వంటి వాటికి గవర్నర్ ప్రసంగంలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల భర్తీతో పాటు అసెంబ్లీకి నామినేట్ చేయాల్సిన ఆంగ్లో ఇండియన్పైనా ఈ సందర్భంగా కేబినెట్ చర్చించింది. ఇక తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతో పాటు సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం పేషీ అధికారులు పాల్గొన్నారు. కాగా, తల్లి కర్మకాండల కోసం స్వగ్రామంలోనే ఉన్న విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాత్రం దీనికి హాజరుకాలేదు.
హిమాచల్ ఘటనపై కేబినెట్ దిగ్భ్రాంతి
విజ్ఞాన, విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన రాష్ర్ట విద్యార్థులు అక్కడి బియాస్ నదిలో గల్లంతవడంపై రాష్ట్ర మంత్రివర్గం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
లీకులిస్తే జాగ్రత్త!
Published Mon, Jun 9 2014 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement