ఎమ్మెల్యేలకు ‘మిషన్’ బాధ్యతలు: హరీశ్ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు ‘మిషన్’ బాధ్యతలు: హరీశ్

Published Mon, Mar 16 2015 1:26 AM

Legislators 'mission' responsibilities: Harish

సాక్షి, హన్మకొండ: ఎమ్మెల్యేలకు చెరువులను దత్తత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌లో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. చెరువుల పూడిక ద్వారా వచ్చే మట్టిని తొలుత రైతులకు అందజేస్తామన్నారు. ఆ తర్వాత ఊళ్లలో ఉన్న పాడుబడ్డ బావులను పూడ్చేందుకు ఉపయోగిస్తామన్నారు. ఆపై ఇటుక బట్టీలు, ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్లు నింపుకునేందుకు ఎవరైనా కోరితే వారికి అందిస్తామన్నారు. చెరువు శిఖం భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయని, వీటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
 

Advertisement
Advertisement