కలసికట్టుగా కదులుదాం | Sakshi
Sakshi News home page

కలసికట్టుగా కదులుదాం

Published Sat, Dec 6 2014 3:59 AM

కలసికట్టుగా కదులుదాం

చెరువుల పునరుద్ధరణపై సుదీర్ఘ చర్చ
సభ్యుల నుంచి సూచనల స్వీకరణ
ఆక్రమణలు, కబ్జాలను ఉపేక్షించవద్దు
రెవెన్యూశాఖ అధికారులు స్పందించాలి
బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు
నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ఆదేశం
‘మిషన్ కాకతీయ’పై ప్రజాప్రతినిధులతో సమీక్ష

 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రధానంగా చిన్ననీటి వనరుల అభివృద్ధి, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర నాలుగు అంశాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని 3,251 చెరువులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు.

శుక్రవారం జడ్‌పీ సమావేశ మందిరంలో చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, నీటిపారుదలశాఖ అధికారులు, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.  చెరువులు, కుంటల పునరుద్ధరణపై పలు సూచనలు చేశారు. వినతులను సమర్పించారు.
 
రైతుల పాత్రే కీలకం

అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 3,251 చెరువులకుగాను ఈ ఏడాది 700 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తూ పంటల సాగులో, దిగుబడిలో జిల్లాకు ధాన్యాగారంగా పేరు తెచ్చారన్నారు. చెరువుల పునరుద్ధరణతో వృత్తి పనివారికి  ఉపాధి లభిస్తుందని, పశువులకు, గొర్రెలకు తాగునీరు లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీరును నియమించామన్నారు. కబ్జాకు గురయిన చెరువుల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ చెరువుల నుంచి తీసిన మట్టి నమూ నాలను సేకరించి, వాటిని వాడడంతో కలిగే ఫలితాలను తెలియజేయాలని జేడీఏకు సూ చించారు. చెరువుల చుట్టూ చెట్లు, కాలువల గట్టున ఈత చెట్లను నాటించనున్నామన్నారు. ఈనెల మూడవ వారం కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను గ్రామాలలో ఉద్యమరీతిలో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు.పనులు పారదర్శకంగా ఉండా ల ని, అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల ని, అవసరమైన చోటే ఖర్చు చేయాలని అన్నా రు. ప్రతి ఏఈకి ల్యాబ్‌టాప్‌లు, సర్వే పరికరా  లు అందిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏడాదికి ఒక మిని ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆక్రమణలు, కబ్జాదారుల భరతం పట్టండి

‘మిషన్ కాకతీయ’పై జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటల ఆక్రమణలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్, బాన్సువాడ, బిచ్కుంద తదితర ప్రాం    తాలలో కబ్జాలకు గురైన చెరువులపై అధికారు లు స్పందించడం లేదని వాపోయారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు చెరువుల పునరుద్ధరణలో రెవెన్యూశాఖ పాత్ర ఏమీ లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని, ఖచ్చితంగా నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కబ్జా దారుల భరతం పట్టాల్సిందేనన్నారు.

రెండు శాఖలు సమన్వయంతో సర్వే చేసి ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా వదలిపెట్టద్దన్నారు. చెరువుల పునరుద్ధరణలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని కోరారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందు కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.1,122 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.750 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి ఇందూరు జిల్లా బడ్జెట్ ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట ని పేర్కొన్నారు.

మంత్రి హరీష్ సుడిగాలి పర్యటన

మంత్రి హరీష్‌రావు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి రో డ్డుమార్గాన నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన మొదట స్థానిక ఎమ్మెల్యే గణేష్‌గుప్త ఇంటికి, అ ర్బన్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంత రం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ.  255.50 లక్షలతో నిర్మించిన మహిళా రైతు వి శ్రాంతి భవనం, క్యాంటిన్, రూప్ట్ షెడ్డు, ఎల క్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్, ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రా రంభించారు. రూ. 405 లక్షలతో ఏర్పాట య్యే గాల్‌వాల్యూమ్ సీట్ షెడ్డుకు, 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి, మురుగు కాలువ నిర్మాణానికి, 10 చిన్న ఈ ట్రేడింగ్ క్యాబిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చే శారు.

జడ్‌పీ సమీక్షలో పాల్గొన్న మంత్రి సదాశివనగర్ మండలం భూంపల్లి చెరువును, ప్రా  ణహిత-చేవెళ్ల కాల్వ నిర్మాణం పనులను, గాం  ధారి మండలం కాటేవాడీ డ్యామ్, గుజ్జులం ప్రాజెక్టును పరిశీలించారు.కార్యక్రమంలో మం త్రి పోచారం, ఎంపీ కవిత, కలెక్టర్ రొనాల్డ్‌రో స్,  మేయర్ సుజాత, శాసనమండలి స భ్యు   లు వీజీ గౌడ్, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతు సింధే, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్త, డీ సీ సీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement