ప్రియురాలు తిట్టిందని..

17 Oct, 2015 18:03 IST|Sakshi

బంజారాహిల్స్ : 'పనీపాటా లేకుండా నేను సంపాదించిన సొమ్ముతో తిని పడుకుంటున్నావ్' అంటూ సహజీవనం చేస్తున్న ప్రియురాలు తిట్టడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్‌పేట చాకలి బస్తీకి చెందిన కె.లోకేష్(28), మీరా అనే యువతి కొన్ని రోజులుగా సహజీవనం చేస్తూ యూసుఫ్‌గూడలో ఉంటున్నారు.

మీరా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. లోకేష్ నిరుద్యోగి. గత కొద్దిరోజులుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నా లోకేష్‌కు ఫలితం దక్కటం లేదు. దీనికి తోడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నావంటూ రోజూ మీరా సూటిపోటి మాటలతో వేధిస్తోంది. భరించలేక శుక్రవారం రాత్రి లోకేష్ తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కె.రాజు ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు