విద్యార్థులకు సంకెళ్లు:మదర్సా నిర్వాహకుల నిర్వాకం! | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సంకెళ్లు:మదర్సా నిర్వాహకుల నిర్వాకం!

Published Sun, Nov 2 2014 2:50 PM

విద్యార్థులకు సంకెళ్లు:మదర్సా నిర్వాహకుల నిర్వాకం!

నల్గొండ: చిన్నారులకు  స్వేచ్ఛ కరువైపోయింది. వారి జీవితాలతో ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారిని వేధిస్తున్నారు. వారి స్వేచ్ఛని హరిస్తున్నారు. వారు ఏం కోరుకుంటున్నారో ఆలోచించడంలేదు. వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించడంలేదు. చదువు పేరుతో వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు. వారిపట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో వేములపల్లి గ్రామంలో మదర్సా నిర్వాహకులు విద్యార్థులకు ఏకంగా సంకెల్లువేసి బంధించారు. ముగ్గురు విద్యార్థుల కాళ్లను ఇనుప గొలుసులతో కట్టివేసి, తాళాలు వేసి బంధించారు.

ఈ బాధ భరించలేక విద్యార్థులు ఇమ్రాన్, జమాల్, ఇంఫాల్ ముగ్గురూ  మదర్సా నుంచి శనివారం రాత్రి పారిపోయారు. మిర్యాలగూడెం సమీపంలో ఒక పొలంలో ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు వారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి, వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

చివరకు ఆ తల్లిదండ్రలు చెప్పింది ఏమిటంటే,  తమ పిల్లు పారిపోకుండా తామే నిర్బంధించమన్నట్లు తెలిపారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement