నీటిపారుదల శాఖలో బదిలీల మాయ! | Sakshi
Sakshi News home page

నీటిపారుదల శాఖలో బదిలీల మాయ!

Published Tue, Apr 19 2016 4:52 AM

నీటిపారుదల శాఖలో బదిలీల మాయ!

10 రోజుల కిందట 75 మంది ఇంజనీర్ల బదిలీ
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నీటిపారుదలశాఖలో కొందరు ఇంజనీర్లు కోరుకున్న చోట కొలువు ఉంటే తప్ప పనిచేయలేని స్థాయికి వచ్చారు. ఆసక్తి ఉన్నచోట పనిచేయనిస్తే సరి.. లేదంటే దీర్ఘకాలిక సెలవు. రాజకీయ ఒత్తిళ్లతో బదిలీల రద్దు చేసుకుంటున్నారు. నీటి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏక కాలంలో 75 మంది ఇంజనీర్లను బదిలీ చేసింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె.జోషి బదిలీ లేఖ ఆధారంగా నీటిపారుదలశాఖ ఇంజనీరు ఇన్ చీఫ్ (పరిపాలన విభాగం) జె.విజయప్రకాశ్ కూడా బదిలీ అయి నా తక్షణమే విధుల్లో చేరాలని ఇంజనీర్‌లందరికీ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇందులో 43 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా కూడా అవకాశం కల్పించింది.

ఈ ఉత్తర్వులు వెలువడి 10 రోజులైనా సుమారు 52 మంది ఇంజనీర్లు పాత స్థానాల్లోనే కొనసాగుతూ బదిలీ ఉత్తర్వుల రద్దు కోసం కొందరు ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల ద్వారా ఎవరికి తోచిన విధంగా వారు మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దళారులుగా అవతారమెత్తిన  కొందరు అధికారులు బదిలీ ఉత్తర్వుల రద్దు పేరిట బేరసారాలు చేస్తుండగా.. రెండు రోజుల్లో మాడిఫికేషన్ ఉత్తర్వులు వెలువడవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

Advertisement
Advertisement