పెర్కకొండారంలో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

పెర్కకొండారంలో వ్యక్తి దారుణ హత్య

Published Wed, Jul 2 2014 4:40 AM

పెర్కకొండారంలో వ్యక్తి దారుణ హత్య

 పెర్కకొండారం(శాలిగౌరారం) :ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని పెర్కకొండారంలో  మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకటయ్య(60) సోమవారం రాత్రి తన వ్యవసాయబావి వద్ద నుంచి ఇంటికి తిరిగివస్తుండగా గుర్తుతెలియని దుండగులు దారికాచి దారుణంగా హ త్య చేశారు. ముందుగా వేసుకున్న పథ కం ప్రకారం మారణాయుధాలు, కారం పొడి ప్యాకెట్‌ను వెంట తెచ్చుకొని సైకిల్‌పై ఇంటికి వస్తున్న వెంకటయ్యను మార్గమధ్యలో అటకాయించి కళ్లలో కారం చల్లారు. దీంతో కిందపడిన వెంకటయ్యపై పదునైన ఆయుధాలతో వేటు వేశారు. గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు దారిగుండా సుమా రు 30 మీటర్లు పరుగెత్తిన వెంకటయ్య ను వెంటాడి రోడ్డుపక్కన ఉన్న వ్యవసాయ భూమిలో అత్యంత కిరాతకంగా కర్రలతో కొట్టి, కత్తులతో నరికి చం పారు.
 
 తల,ముఖంపైనే సుమారు 10కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. రాత్రి అయినప్పటికీ తండ్రి ఇంటికి రాకపోవడంతో చిన్న కుమారుడు అక్కల వద్దకు వెళ్లాడనుకుని రాత్రి అందరికీ ఫోన్‌చేసి తెలుసుకున్నాడు. ఎక్కడా జాడ తెలియక పోవడంతో మంగళవారం తెల్లవారుజామున వ్యవసాయ బావివద్దకు వెళ్లి చూ సి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని ఓ వ్యవసాయ భూమిలో హత్యకు గురై ఉన్నాడు. విషయం గ్రామస్తులకు తెలి యడంతో మృతదేహాన్ని చూసేం దుకు ప్రజలు తండోపతండలుగా తరలి వచ్చారు. మృతదేహం వద్ద అతడి కుమార్తెలు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చినవారిని కలిచివేసింది. సంఘటన స్థలా న్ని శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్ ఐ మహేశ్‌లు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరు, అం దుకుగల కారణాలను మృతుడి కుటుం బీకులు, బంధువులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ నుం చి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి చిన్నకుమారుడు శ్రావణ్‌కుమార్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
 
 కొడుకే కడతేర్చాడా..?
 పెర్కకొండారం గ్రామానికి చెందిన గుం డెబోయిన వెంకటయ్య(60) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తున్నాడు. ఇతడికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు విప్లవ్, శ్రావణ్‌కుమార్ ఉన్నారు. వెంకటయ్య భార్య సుమారు 10 సంవత్సరాల క్రితం మృతిచెందింది. భార్య మృ తి చెందినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా పిల్లలను పోషించుకుం టూ వచ్చాడు. ప్రస్తుతం చిన్నకుమారు డు శ్రావణ్‌కుమార్ మినహా అందరి వివాహాలు జరిపించాడు. తనకున్న 12 ఎకరాల వ్యవసాయ భూమిలో కుమార్తెలకు 4 ఎకరాలు కట్నకానుకల కింద ఇచ్చా డు. మిగిలిన 8 ఎకరాలలో కుమారుల తో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రాణ్‌కుమార్ చదువుకుంటుండగా వివాహితుడైన పెద్ద కుమారుడు వ్యవసాయం చేస్తూ గ్రామ ంలో కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకోసం తండ్రి వెంకటయ్య రూ.70 వేలను పెద్దకుమారుడు విప్లవ్‌కు ఇచ్చాడు. ఆరు నెలల క్రితం వరకు సాఫీగా సాగిన వీరి కుటుంబంలో భూతగాదాలు మొదలయ్యాయి.
 
 ఈ క్రమంలో తాను ఇచ్చిన డబ్బులను తిరి గి ఇవ్వాలని తండ్రి కోరడంతో మద్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు భూతగాదాకు దారితీశాయి. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తండ్రి వెంకటయ్య పెద్ద కుమారుడు విప్లవ్‌లు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో విప్లవ్‌కు దెబ్బలు తగలడంతో సుమారు 20 రోజు ల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు.అనంతరం పెద్ద కుమారుడు ఇంటికి రాగానే తండ్రి వెంకటయ్య చిన్నకుమారుడు శ్రావణ్‌కుమార్‌తో కలిసి గ్రామం లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. దీన్ని అవమానంగా భావించిన వెంకట య్య తిరిగి సొంత ఇంటికి చేరుకొని పెద్దకుమారుడిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని గొడవ పడ్డారు.
 
 తనవాటా ఆస్తి ఇస్తే వెళ్లిపోతానని చెప్పడంతో తమ్ముడి పెళ్లి జరిగేంత వరకు వాటా ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో విప్లవ్ గ్రామ పెద్దలను ఆశ్రయించి పంచాయితీ పెట్టగా తండ్రి వెంకటయ్య రాలేదు. దీంతో చేసేదేమి లేక 10 రోజుల క్రితం విప్లవ్ తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఇల్లు విడిచి తన అత్తగారి గ్రామమైన నార్కట్‌పల్లి మం డలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరి దిలోని తుర్కబాయిగూడేనికి వెళ్లిపోయాడు. దీంతో   కక్ష పెంచుకున్న విప్లవ్ పలుమార్లు తండ్రిని చంపుతానని తన అక్కాచెల్లెళ్లకు ఫోన్‌లో తెలిపాడు. ఈ క్రమంలోనే మూడు రోజులుగా రెండు బైక్‌లపై తన స్నేహితులతో కలిసి విప్లవ్ నకిరేకల్, పెర్కకొండారం గ్రామాల్లో సంచరించినట్లు తెలిపారు.
 
 ఇదే విషయంపై సోమవారం కూడా ఫోన్ చేసిన విప్లవ్ ఓ బైక్‌పై పెర్కకొండారానికి చెందిన ఒక స్నేహితుడు తుర్కబాయిగూడేనికి చెందిన మరో స్నేహితుడితో కలిసి సాయంత్రం గ్రామంలో తిరిగి న ట్లు వెంకటయ్య చిన్నకుమారుడు శ్రావణ్‌కుమార్ తెలిపాడు. వెంకటయ్య హ త్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పెద్ద కుమారుడు విప్లవ్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో వా రే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్ కూడా తన సోదరుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement