కామాంధునికి యావజ్జీవం | Sakshi
Sakshi News home page

కామాంధునికి యావజ్జీవం

Published Thu, Jun 26 2014 2:40 AM

Man sentenced to imprisonment for raping a Model

సాక్షి, హైదరాబాద్:  తన కోరిక తీర్చలేదని ముంబైకి చెందిన ఓ మోడల్‌ను హత్య చేసిన నిందితుడికి నాంపల్లి 5వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. కలకత్తాకు చెందిన అర్జూ అర్మాన్ అలీ భర్తతో మనస్మర్థలు రావడంతో అతని నుంచి దూరంగా ఉంటోంది. ముంబైకి చేరి మోడల్‌గా మారింది.  2009 జూలై 19న ఆమెను రాఖేష్, సిద్దికీలు అర్మాన్‌ని నగరానికి రప్పించి ఓ హోటల్ గదిలో ఉంచారు.  సిద్ధికీ స్నేహితుడు రాజేశ్వరయ్యను అర్మాన్ వద్ద ఉంచారు. అయితే రాజేశ్వరయ్య  తన కోరిక తీర్చాలని ఆమె వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో జూలై 25న అమెను హత్య చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement