ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మనస్విని | Sakshi
Sakshi News home page

ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మనస్విని

Published Tue, Jul 28 2015 4:13 AM

ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మనస్విని - Sakshi

- రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోరుు..తానూ బ్రెరుున్‌డెడ్ అరుు
- సజీవంగా బాలిక అవయవాలు
చేర్యాల :
రోడ్డు ప్రమాదంలో తానేకాదు.. తన తల్లిదండ్రనీ కోల్పోరుున బాలిక మనస్విని తన అవయవాల దానంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. పుష్కర స్నానాలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తనువు చాలించినా అవయవాల రూపంలో సజీవంగానే ఉంది.
 
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ముక్క(గంగిశెట్టి) గోపీనాథ్ నాలుగున్నరేళు ్లగా చేర్యాలలో నివాసం ఉంటూ వీరన్నపేట శివారులో లక్ష్మి ఇండస్ట్రీస్ పారాబారుల్డ్ రైస్ మిల్లు నడిపిస్తున్నారు. అతడి కూతురు మనస్విని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. గోపీనాథ్ తన కూతురు మనస్విని, బావమరిది అరుత రాజేశ్ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నా నాల కోసం నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు వెళ్లారు.

తిరుగు ప్రయూణంలో ఈ నెల 22న డిచ్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. ఈ ఘటనలో గోపీనాథ్, రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్ కూ తురు మనస్విని,ఆయన భార్య రూప తీవ్రం గా గాయపడ్డారు. వీరిని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మనస్విని బ్రెరుున్ డెడ్‌కు గురైంది. దీంతో ఆమెను బంజారాహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధుల విన్నపం మేరకు బాలిక తాత య్య ముక్క ముక్క రాజయ్య బాలిక అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు.

జీవన్‌దాస్ సంస్థ ఆధ్వర్యంలో మనస్విని కళ్లు, లివర్, కిడ్నీలు, గుండె యవరాలు సేకరించారు. వీటిని వైద్యులు ఐదుగురు చిన్నారులకు అమర్చారు. మనస్విని మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి దానం చశారు. ఈసందర్భంగా తాత రాజయ్య, బంధువు అయిత రవి మాట్లాడుతూ, మనస్విని మృతి చెందినా ఆమె అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఆమె లేని లోటును వీరిలో చూసుకుంటున్నామని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement