ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

Published Mon, Feb 29 2016 1:31 AM

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర  మరువలేనిది

హన్మకొండ అర్బన్ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండ నక్కల గుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో జరగుతున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశా ల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా స్పీకర్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా జర్నలిస్టులు ఎన్ని సమస్యల్లో ఉన్న సమాజహితం కోసం నిస్వార్థంగా పనిచేస్తారని కొ నియాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక ఇబ్బం దులకు ఎదురునిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించేలా ప్రజలను ైచె తన్యపరిచిన ఘనత జర్నలిస్టులకు దక్కుతుందని అన్నారు. ఉద్యమంలో వారి సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు కార్యక్రమా లు చేపడుతున్నారని తెలిపారు.

డబుల్ బెడ్‌రూం ఇం డ్లు, హెల్త్ కార్డులు అందులో భాగమే అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజంలో విలువలు తగ్గుతున్నాయని, దీనికి కారణం మాత్రం జర్నలిస్టులు కాదన్నారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి రావడంతో వారి స్వలాభం కోసం పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు ప్రజలకు చేరవేయడం జర్నలిస్టులకు కత్తిమీద సాములా మారిందని తెలిపారు.  రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ర్యాక్రమాలు చేపడుతోందని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సుమారు 26రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.  కార్యక్రమంలో ఐజే యూ జాతీయ అధ్యక్షుడు ఎస్‌ఎన్.సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, దొంతు రమేష్, నాయకులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement