'డంకిన్ డోనట్స్' కోసం క్యూ కట్టారు

9 May, 2015 10:41 IST|Sakshi
'డంకిన్ డోనట్స్' కోసం క్యూ కట్టారు

హైదరాబాద్ : ఫ్రీగా వస్తే ఎవరైనా సరే ఏదీ వదిలిపెట్టరు. అదీ ఫుడ్... ఉచితంగా ఇస్తేమంటే ఇంకేంటి పండుగే.  అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. దాంతో సుమారు రెండు కిలోమీరట్ల వరకూ క్యూ ఏర్పడింది. ఎక్కడా అనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా షాపు ఓపెన్ చేస్తే ...కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు పెడతారు. 'డంకిన్ డోనట్స్' కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యింది. మొదటి 300మందికి ఉచితంగా ఫుడ్ సర్వ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించటంతో చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ క్యూ కట్టేశారు.

ఇంతకీ ఈ షాపు ఎక్కడనుకుంటున్నారా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో 'డంకిన్ డోనట్స్' రెస్టారెంట్. శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని రెస్టారెంట్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే ప్రచారం చేపట్టింది. ముందుగా వచ్చిన 300మందికి ఉచితంగా  సర్వ్ చేస్తామని. దాంతో ఉదయం 5 గంటల నుంచే షాప్ ముందు పడిగాపులు పడ్డారు. చాంతాడంత క్యూ ఏర్పడటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా డ్యూటీలోకి దిగారు. కొసమెరుపు ఏంటంటే... ఈ క్యూలో బడాబాబులే ఎక్కువగా ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు