Sakshi News home page

మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం

Published Sun, Aug 31 2014 12:32 AM

medical counselling started

విజయవాడ/విశాఖపట్నం/ తిరుపతి: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు ఆన్‌లైన్ కేంద్రాల్లో తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. సీటు తీసుకున్నాక రద్దు చేసుకునే విద్యార్థులు రూ.లక్ష చెల్లిస్తేనే ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇస్తామని ఈ ఏడాది నిబంధన విధించారు. తొలి రోజు కౌన్సెలింగ్ రాత్రి 10.50 గంటలకు ముగియగా, 1,325 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి రోజు 1,361 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ కేంద్రంలో 569 మంది, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 76, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 324, ఆంధ్ర యూనివర్సిటీలో 164, తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో 228 మంది హాజరయ్యారు. మొదటి ఇద్దరు ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తొలి సీటును హైదరాబాద్ జేఎన్‌టీయూ కౌన్సెలింగ్ కేంద్రంలో 3వ ర్యాంకర్ కె.పృథ్వీరాజ్‌కు కేటారుుంచారు. 5వ ర్యాంకర్ వి.మనోజ్ఞితరెడ్డి కూడా జేఎన్‌టీయూలోనే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరిద్దరికీ ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చాయి.

 

4వ ర్యాంకర్ దారపనేని హరితకు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు లభించింది. 6, 7, 8, 9, 10, 11వ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు గైర్హాజరయ్యారు. వీరంతా ఎయిమ్స్, జిప్‌మర్, తదితర వైద్య విద్యా సంస్థల్లో చేరి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ కళాశాలల్లోని ఎంబీబీఎస్ (4610 కన్వీనర్ కోటా) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. 3 ప్రభుత్వ, 23 ప్రైవేట్, నాన్- మైనార్టీ డెంటల్ కాలేజ్‌ల్లో బీడీఎస్ (1,506 కన్వీనర్ కోటా) సీట్లకూ కౌన్సెలింగ్ జరుగుతోంది. కొత్తగా అనుమతి పొందినతిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోని 127 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆదివారం 1,501 నుంచి 4,500 ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌కు పిలిచారు.
 
 గుట్టుగా యాజమాన్య కోటా దరఖాస్తుల విక్రయం
 
 ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్య కోటా(సీ-1 కేటగిరీ) సీట్లలో  చేరేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గత రెండు రోజులుగా గుట్టుగా దరఖాస్తులు విక్రయిస్తోంది. కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తులు విక్రరుుంచటానికి నిరాకరించడంతో కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్త్ యూనివర్సిటీలో దరఖాస్తులు విక్రయిస్తున్నారు. అరుుతే ఈ దరఖాస్తులకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు, ప్రచారం చేయకుండా విక్రయించాలని వర్సిటీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement