మెడికల్ షాపుల్లో స్వైప్ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

మెడికల్ షాపుల్లో స్వైప్ తప్పనిసరి

Published Wed, Dec 7 2016 8:39 PM

మెడికల్ షాపుల్లో స్వైప్ తప్పనిసరి - Sakshi

అనంతగిరి: మెడికల్ షాపుల్లో తప్పకుండా స్వైప్ మిషన్లు ఉపయోగించాలని వికారాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ రువికుమార్ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని యాష్కి సునీల్ నివాసంలో మెడికల్ షాపుల యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నగదురహిత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం మెడికల్ షాపుల్లో తప్పకుండా స్వైప్ మిషన్లు సాధ్యమైనంత తక్కువ రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతర రకాల వ్యాపారుల కంటే ముందు మెడిల్ దుకాణాల్లో స్వైప్ మిషన్లను అందుబాటులోకి తీసుకరావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపుల్లో కూడా స్వైప్ మిషన్లు తప్పని సరి వాడాలన్నారు.

మెడికల్ షాపులు నడిపించే యజమానులకు ఎంతోకొంత అవగాహన ఉన్నవారేనని, స్వైప్ మిషన్లు ఉపయోగించడం వారికి ఎంతో తేలికన్నారు. ప్రతి కుటుంబం ఏదో రకమైన మందులు కొనడానికి మెడికల్ షాపులకు వస్తారని, వారందరికి నగదు రహిత వ్యాపారంపై నచ్చజెప్పాలన్నారు. కొన్ని రకాల బ్యాంక్ డెబిట్ కార్డులకు సేవా పన్ను వసూళ్లు చేస్తున్నారని, ఈ పన్నును మినహాయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లాలోని అన్నీ ప్రాంతాలకు వెళ్లి ప్రతి మెడికల్ షాపులో స్వైప్ మిషన్లు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెడికల్ షాపుల యజమానుల సంఘం నాయకుడు వి. శ్రీనివాస్ మాట్లాడుతూ స్వైప్ మిషన్లకోసం ఇప్పటికే బ్యాంక్‌లకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ శాపుల యజమానులు ఎం.శ్రీనివాస్, సునీల్, అరవింద్, తిరుపతిరెడ్డి, విజయ్‌కుమార్, సత్యనారాయణ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement