రూ.30.60 కోట్లు | Sakshi
Sakshi News home page

రూ.30.60 కోట్లు

Published Fri, Jul 31 2015 1:56 AM

Metropolitan, urban funding

మహానగర, పట్టణాలకు నిధుల మంజూరు
 
గ్రేటర్ వరంగల్    రూ.23.85 కోట్లు
జనగామ మునిసిపాలిటీ    రూ.1.42 కోట్లు
మానుకోట మునిసిపాలిటీ    రూ.1.72 కోట్లు
భూపాలపల్లి నగర పంచాయతీ    రూ.1.96 కోట్లు
నర్సంపేట నగర పంచాయతీ    రూ.98.42 లక్షలు
పరకాల నగర పంచాయతీ    రూ.65.14 లక్షలు
 
మహా నగర పాలక సంస్థ, రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా 2015-20 వరకు ఐదేళ్ల పాటు నిధులు మంజూరు చేయనుంది. తొలి ఏడాది రూ. 30.60 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.- వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పా లక సంస్థతోపాటు జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఊరట కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం నిధులు కేటారుుంచింది. 2015 నుంచి 2020 వరకు ఐదేళ్లపాటు నిధులు మంజూ రు చేయనుంది. ఇందు లో భాగంగా తొలి ఏడా ది రూ.30.60 కోట్లు  మంజూరు చేస్తూ  రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.23.85 కోట్లు, జనగామ మునిసిపాలి టీకి రూ. 1.42 కోట్లు, మహబూబాబాద్ ము నిసిపాలిటీకి రూ. 1.72 కోట్లు, భూపాలపల్లి నగర పంచాయతీకి రూ.1.96 కోట్లు, నర్సం పేటకురూ.98.42 లక్షలు, పరకాల నగర పంచాయతీకి రూ. 65.14 లక్షలు కేటారుుంచారు.   

ఇలా ఖర్చు చేయాలి..
14వ ఆర్థిక సంఘం నిధులను ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలనే అంశాన్ని పుర పాలక శాఖ స్పష్టంగా ప్రకటించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, శ్మశానవాటికలు, కూరగాయలు, చేపలు, మాంసం మార్కెట్లు, లే అవుట్ ఖాళీ స్థలాల అభివృద్ధి, జంతు వధశాలలు, ప్రధాన జంక్షన్లు, సెంట్రల్ మిడియమ్స్ వంటి అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించాలి. నిధుల్లో 10 శాతం వీధి దీపా లకు ఖర్చు చేయాలి. పార్కుల అభివృద్ధి, తాగునీటి పైపులైన్ల అనుసంధానం, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ప్రధాన ప్రాజెక్టులను పబ్లిక్ , ప్రైవేట్,పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో డీపీఆర్‌లకు 10 శాతం కేటారుుంచాలి. రహదారుల అభివృద్ధి, ఐటీ నిర్వహణకు 20 శాతం వెచ్చించాలి.

షెడ్యూల్ ఇలా...
 వార్షిక అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాపై కార్పొరేషన్, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు ఈనెల 27 లోపు వివిధ అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు తయారు చేయా లి.  కానీ వరంగల్ మహా నగర పాలక సంస్థ ఇంజినీర్లు ఈ ప్రక్రియను ఇప్పటివరకు ప్రారంభించలేదు. స్టేక్ హోల్డర్ల సమావేశం ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులపై  ప్రజలు అభిప్రాయాలను స్వీకరించి, మార్పు లు చేర్పులు చేపట్టాలి.  ఆగస్టు 3న కౌన్సిల్ తీర్మానం చేయాలి. ఆరో తేదిన మునిసిపల్ శాఖ ప్రాం తీయ సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించాలి. 14న సాంకేతిక కమిటీ ఆమోదంతో ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆగస్ట్ 17న రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్‌కు సమర్పించాలి.

13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15.75 కోట్లపై నీలినీడలు
 13వ ఆర్థిక సంఘం ప్రణాళిక కింద ఐదేళ్ల కాల వ్యవధి (2010-15)లో వివిధ అభివృద్ధి పనులకు వరంగల్ బల్ది యా ఇంజినీర్లు రూ. 51.31 కోట్లతో ప్రతిపాదనలను రూ పొందించారు. ఈ నిధులను కేంద్రం విడతలవారీగా మం జూరు చేసింది. నాలుగేళ్లలో ప్రభుత్వం రూ. 35.56 కోట్లు విడుదల చేసింది. వీటి ఖర్చుకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్ (యూసీ) సమర్పించకపోవడంతో రావాల్సిన రూ.15.75 కోట్ల నిధుల మంజూరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement