కేంద్రం మా కాళ్లు, చేతులు కట్టేసింది | Sakshi
Sakshi News home page

కేంద్రం మా కాళ్లు, చేతులు కట్టేసింది

Published Tue, Oct 14 2014 1:25 AM

కేంద్రం మా కాళ్లు, చేతులు కట్టేసింది

మంత్రి హరీశ్‌రావు
 
సిద్దిపేట టౌన్: ‘తెలంగాణలో పాలనను ఉరకలెత్తించాలని మాకూ తపన ఉంది. కానీ కేంద్రం మా కాళ్లు, చేతులను కట్టేసింది’ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఎన్జీఓ భవన్‌లో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిజమైన పాలన నడవడం లేదన్నారు. బ్యూరోక్రాట్లపై ఆధారపడ్డ పాలన వేగం తగ్గిన మాట నిజమేన్నారు. 152 మంది ఐఏఎస్‌లు, 132 మంది ఐపీఎస్‌లు, 60 వుంది ఐఎఫ్‌ఎస్‌లు తెలంగాణకు కావాల్సి ఉండగా సగం మంది కూడా లేరన్నారు. ఇందుకు కేంద్రమే కారణమన్నారు.   ఈ పరిస్థితి గురించి కేంద్రానికి ఎంత చెప్పి నా వినిపించుకోకుండా చెవిటి దానివలే వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 పత్తికి మద్దతు ధర అందిస్తాం

తెలంగాణలో పత్తి రైతాంగానికి కనీస మద్దతు ధర అందిస్తావుని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేటలోని పత్తిమార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తికొనుగోలు కేంద్రాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.  తెలంగాణ పరిధిలోని 78 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన రూ.4,050 మద్దతు ధర రైతులకు అందేలా అధికారులు పని చేయాలని ఆయన సూచించారు.
 

Advertisement
Advertisement