Sakshi News home page

రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి

Published Tue, Jun 23 2015 1:46 AM

రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి

మంత్రి జోగు రామన్నకు బీసీ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రూ.20 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్నకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధిబృందం విజ్ఞప్తిచేసింది. బీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని,   బీసీ కాలేజీ హాస్టళ్ల స్వంతభవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఉన్నత చదువులకోసం రుణాలు పొందడానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయపరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని కోరా రు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రి జోగురామన్నకు బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ, ర్యాగరమేష్, శ్యామ్, పి.ఉష, రవి, ఎం.వీణ, మల్లేష్‌యాదవ్ వినతిపత్రాన్ని సమర్పించారు. కాగా, బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపినట్లు కృష్ణయ్య వెల్లడించారు.

Advertisement

What’s your opinion

Advertisement