Sakshi News home page

‘మిషన్’ స్లో..

Published Thu, Apr 30 2015 1:56 AM

Mission Kakatiya Works Going Slow

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ పనులు (మిషన్ కాకతీయ) మందకొడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రారృంభించిన ప్రాంతాల్లో పనులు ఓ మోస్తారు గానే ముందుకు పోతృున్నా...ఇంకా చాలా చోట్ల పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్టర్లు పో టా పోటీగా తక్కువ రేట్లకు కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. కానీ పనులు ప్రారంభిం చాలంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు. టెండరు నిబంధనలు కఠినంగా ఉండటంతో లె స్‌లకు వేసిన కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తంలో ముందుగానే ప్రభుత్వానికి జమ చేయాల్సి వ స్తోంది.

దీంతో చెరువుల పనులతో లబ్ధిపొందాలనుకున్న కాంట్రాక్టర్లకు చేతికి మట్టిడడంతో మిషన్ పనులు నెమ్మదించాయి. పదిశాతానికి మించి లెస్ కోడ్ చేసి కాంట్రాక్టు సంస్థల నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ రూపేణ ప్రభుత్వానికి ముందుగానే కట్టించుకుంటుంది. ఉదాహరణకు రూ.50 లక్షల పనికి 15 శాతం లెస్ కోడ్ చేసినట్లయితే పది శాతాన్ని మిన హాయించి మిగిలిన 5 శాతం సొమ్మును సంబంధిత సంస్థల నుంచి ప్రభుత్వం ముందుగానే రాబట్టుకుంటోంది. జిల్లాలో ఇప్పటి వరకు టెండర్లు పూర్తయిన చెరువులన్నీ దాదాపు 15 నుంచి 25 శాతం తక్కువ రేట్లకే టెండర్లు వేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు.

ప్ర‘గతి’తప్పుతోంది...
మిషన్ కాకతీయలో భాగంగా తొలి విడత 952 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పరిపాలన ఆమోదం పొందిన  చెరువులు 842 ఉన్నాయి. వీటిలో టెండర్లు పూర్తయిన చెరువులు 716 కాగా...పనులు ప్రారంభించిన చెరువులు మాత్రం 524 మాత్రమే. దీంట్లో 13 చెరువులకు చెందిన కాంట్రా క్టు సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. తక్కువ రేట్లకు టెండర్లు వేయడం వల్ల గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో పనులు చేపట్టకుండా పక్కకు తప్పుకున్నారు. నిబంధనల మేరకు సంబంధిత సంస్థలకు మూడేళ్ల పాటు టెండర్లు వేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు అధికారులు చెప్పారు. ఇవిగాక టెండర్లు పూర్తయినప్పటికీ పనులు మొదలు పెట్టని చెరువులు ఇంకా 192 ఉన్నాయి. భువనగిరి, నల్లగొండ డివిజన్ పరిధిలోనే ఎక్కువగా చెరువులు పనులు వెనకంజలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ జాబితాలో కూడా ఈ రెండు డివిజన్‌ల పరిధిలోని సంస్థలే ఉన్నాయి.

ముంచుకొస్తున్న గడువు...
చెరువుల పూడికతీతకు వేసవి కాలం అనుకూలంగా ఉంటుంది. కానీ జిల్లాలో చెరువుల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మార్చి 17 నుంచి మిషన్ కాకతీయ ఆచరణలోకి వచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో అకాల వర్షాల కారణంగా భువనగిరి డివిజన్‌లో   పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొద్ది రోజులపాటు పనులు నిలిపేశారు. చెరువుల పునరుద్ధరణ ఎక్కువ భాగం పూడికతీత పనులే ఉన్నాయి. ఈ పనుల తర్వాతి దశలో చెరువుల మీద కట్టలు కట్టడం, ఫీడర్ చానళ్లు నిర్మాణం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ పూడికతీత పనులే ఇంకా పూర్తికాలేదు. మే నెలాఖరులోగా పూడికతీత పనులు పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది.

బిల్లులపై సందిగ్ధత...
చెరువుల పనులకు సంబంధించిన బిల్లులు చేసేందుకు అధికారులకు జంకుతున్నారు. అ ర్వపల్లి మండలంలో చెరువుల పనులు 70 శాతం పూర్తయిన వాటికి బిల్లులు చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. తాము ముందుగా తొందరపడి బిల్లులు చేస్తే ఎలాంటి పరి ణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన వారిలో నెలకొంది. బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని కాంట్రాక్టు సంస్థలకు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పూడికతీత మట్టి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించిన తర్వాతే మట్టిని రైతులకు కాకు ండా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే వీలుంది. కానీ దీనిని ఎక్కడా పాటించడం లేదు. నల్ల గొండ మండలంలో చెరువుల మట్టిని ఇటుకబట్టీలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదు వస్తున్నా...అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై ఈఈ హామీద్ ఖాన్ వివరణ కోరగా...సంబంధిత కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

డివిజన్ల వారీగా మిషన్ కాకతీయ చెరువుల వివరాలు
నల్లగొండ              దేవరకొండ    భువ నగిరి        సూర్యాపేట
ఆమోదం పొందిన చెరువులు    201    159    277    205
టెండర్లు పూర్తయిన చెరువులు    158    126    248    184

పనులు ప్రారంభమైన చెరువులు    113    101    165    145
బ్లాక్ లిస్‌ృలో పెట్టిన పనుల సంఖ్య     3    --    10    --
 

Advertisement

తప్పక చదవండి

Advertisement