Sakshi News home page

త్వరలోనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు : హరీశ్‌ రావు

Published Sat, Jul 20 2019 2:23 PM

MLA Harish Rao At Siddipet Aasara Pension Programme - Sakshi

సాక్షి, సిద్దిపేట: దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 130 కోట్ల జనాభాలో రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నది కేసీఆర్‌ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే హరీశ్‌ రావు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంత్‌ నగర్‌లో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. 6 నెలల నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. పెరిగిన పెన్షన్‌ పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్‌ పెన్షన్‌లను రెట్టింపు చేసి పేదలకు ఆసరాగా నిలుస్తున్నారన్నారు హరీశ్‌ రావు. 

57 ఏండ్లు నిండిన వారితో పాటుగా.. కొత్తగా పీఎఫ్‌ వచ్చిన బీడీ కార్మికులను కూడా గుర్తించి పెరిగిన పెన్షన్లు అందిస్తామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా బంద్‌ చేయాలని కోరారు. త్వరలోనే అర్హులైన పేదలందరికి డబుల్‌ బెడ్రూంలు ఇస్తామని స్పష్టం చేశారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. సిద్దిపేట పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని హరీశ్‌ రావు కోరారు. 

Advertisement
Advertisement