ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా

Published Thu, Dec 11 2014 2:30 AM

ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా - Sakshi

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కేసు సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని 2009 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు గతేడాది తీర్పునివ్వగా రమేశ్ సుప్రీంకోర్టు ద్వారా స్టే పొందారు.

స్టే వెకేట్ చేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉండగా, బెంచ్‌పై దీనికి ముందు కేసు విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో రమేశ్ కేసును గురువారం విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం ప్రకటించిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement