చెరువులో పోస్తుండగానే చేప పిల్లలు మృతి | Sakshi
Sakshi News home page

చెరువులో పోస్తుండగానే చేప పిల్లలు మృతి

Published Thu, Sep 14 2017 2:45 AM

చెరువులో పోస్తుండగానే చేప పిల్లలు మృతి

సాక్షి, కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యంతో రెండు లక్షలకు పైగా చేప పిల్లలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగ భూపాలెం చెరువు లో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ బుధవారం చేప పిల్లలు పోశారు. కార్యక్రమం ముగిం చుకుని ఆయన వెనుదిరిగి వెళుతుండగానే సుమారు రెండు లక్షల చేపపిల్లలు మృత్యువాత పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మత్స్య సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటైన సింగభూపాలెంలో 7.20 లక్షల చేపపిల్లలు వేయాలని నిర్ణయించారు. ఈ చెరువులో 80 నుంచి 100 ఎంఎం సైజు కలిగిన పిల్లలు పోయాలని నిర్ణయించగా, వచ్చినవాటిలో అత్యధికం 35 నుంచి 40 ఎంఎం సైజు చేపపిల్లలే కావడం గమనార్హం. మంత్రి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉండటంతో అప్పటికే చేప పిల్లలను ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నీరు పోసి అందులో ఉంచారు. అయితే నీరు వేడెక్కడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని మత్స్యశాఖ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement