దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్‌ సీఎం పూజలు

27 Jun, 2020 02:49 IST|Sakshi
ఫేస్‌ షీల్డ్‌లతో చినజీయర్‌ స్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

సుదర్శన హోమంలో పాల్గొన్న శివరాజ్‌సింగ్‌

శంషాబాద్‌ రూరల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దంపతులు శుక్రవారం ముచ్చింతల్‌లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు దంపతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు