తీవ్రవాదంపై ఉక్కుపాదం.. | Sakshi
Sakshi News home page

తీవ్రవాదంపై ఉక్కుపాదం..

Published Wed, Sep 10 2014 11:11 PM

must be controlling terrorism says t.v shashidhar reddy

వికారాబాద్: తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ టీవీ.శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడాడారు. కొన్ని తీవ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో తాను పై విధంగా మాట్లాడానన్నారు.

తీవ్రవాదాన్ని అణచడానికి తాము హైదరాబాద్ ఇంటెలిజెన్సీ విభాగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. జిల్లా పోలీసు అధికారుల పనితీరును శశిధర్ ప్రశంసించారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రజల సహకారంతో ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. పేదరికం, నిరక్ష్యరాస్యత వల్లే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 వీటి నివారణ కోసం పోలీస్ శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యావంతులు ఆత్మహత్యలపై గ్రామాల్లోని ప్రజలతో చర్చించాలన్నారు. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సైలుగా మహిళలనే నియామకం చేస్తామన్నారు. వికారాబాద్, తాండూరు పట్టణాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement