నక్కలగండికి శ్రీశైలం నీరే! | Sakshi
Sakshi News home page

నక్కలగండికి శ్రీశైలం నీరే!

Published Wed, Jun 3 2015 1:40 AM

నక్కలగండికి శ్రీశైలం నీరే!

ఈ నెల 8న శంకుస్థాపన  {పభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
 
హైదరాబాద్: నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకానికి ఈ నెల 8న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన మాదిరి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం నుంచే 30 టీఎంసీల నీటిని తీసుకొని అప్పర్‌డిండికి తరలించేలా నూతన ప్రణాళికలను ఖరారు చేశారు. నిజానికి ఎస్‌ఎల్‌బీసీ నుంచి నీటిని తీసుకునే ప్రణాళిక ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ను చేపట్టి పూర్తిచేసింది. రెండింటి కింద ఆయకట్టు ఒకటే కావడంతో ఇప్పుడు ఎస్‌ల్‌బీసీతో ఎలాంటి సంబంధం లేకుండా శ్రీశైలం నీటిని వాడుకొని నక్కలగండి ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పిస్తోంది. మొదటి డీపీఆర్ ప్రకా రం.. ఓపెన్ చానల్, టన్నెల్‌ల ద్వారా నక్కల గండి నుంచి మిడ్ డిండికి అక్కడి నుంచి ఎగు వ డిండికి నీటిని తరలించాలని నిర్ణయించారు.

ఈ డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టులో భాగంగా మిడ్‌డిండి రిజర్వాయర్ భాగంగా ఉంటుంది. ఈ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా నక్కల గండి నుంచి గుట్టపైకి నీటిని తరలించి గ్రావిటీ ద్వారా పైప్‌లైన్ మార్గం గుండా నీటిని తరలించే అంశంపైనా అధ్యయనం జరిగింది.   నక్కలగండి నుంచి కొండపైకి 960 మీటర్ల మేర నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా లోయర్ డిండి వరకు 28 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించేందుకు రూ.1500 కోట్ల మేర భారం పెరుగుతుండడంతో దాన్ని పక్కనపెట్టారు. తాజాగా మరోమారు ప్రాజెక్టుపై రీ ఇంజనీరింగ్ చేసిన అధికారులు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మాదిరే శ్రీశైలం నుంచి నిర్ణీత 30 టీఎంసీల నీటిని తీసుకోవాలని సంకల్పించారు.శ్రీశైలం నుంచి నేరుగా ఎగువ డిండి కి నీటిని తరలి స్తారు అక్కడి నుంచి కాల్వ ల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల తాగు, సాగు అవసరాలు తీరుస్తారు. కల్వకుర్తి కింద లేని 50 వేల ఎకరాల ఆయకట్టును నక్కలగండితో నీటిని అందిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు దాదాపు రూ.5,500 కోట్ల మేర వ్యయం కావచ్చని అధికారుల అంచనా.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement