ఈబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 18 2018 2:31 AM

Nayini Narasimha Reddy Unveiled Pilon In Reddy Hostel - Sakshi

హైదరాబాద్‌ : పేద రెడ్ల అభివృద్ధి కోసం ఈబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. రాజా బహద్దూర్‌ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రెడ్డి హాస్టల్‌ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఆదివారం సెంటినరీ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెడ్డి హాస్టల్‌కు 15 ఎకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారని చెప్పారు.

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి ఓవర్సీస్‌ ఫండ్‌ కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజా బహద్దూర్‌ స్ఫూర్తితో అట్టడుగున ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని సూచించారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎడ్ల రఘుపతిరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, సొసైటీ కార్యదర్శి కుందవరం వెంకటరెడ్డి, ఉపా«ధ్యక్షుడు పాపారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, డాక్టర్‌ వసుంధరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement