Sakshi News home page

ఆ‘పరేషాన్’ చేస్తున్నారు

Published Tue, Aug 12 2014 3:45 AM

Negligence of the government hospital operations

-  ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు ఆపరేషన్లు
- పనితీరు మార్చాలని కోరుతున్న రోగులు

 కరీంనగర్ హెల్త్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు సైతం వస్తోంది. ఆపరేషన్లు ఇష్టారీతిన చేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతోందని బాధితులు పేర్కొంటున్నారు. ఆపరేషన్ తర్వాత గాయం త్వరగా నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదీ తేడా..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణీకి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. అవసరం మేరకు చీరుతుండగా(కోత), ప్రభుత్వా స్ప త్రిలో ఇష్టారాజ్యంగా చీరుతున్నారనే ఆరోపణలు న్నా యి. కుట్ల వెడల్పులో, దూరంలోనూ వైద్యవిధానాలు పాటించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ పూర్తికాగానే రోగులకు బాధలు మొదలవుతున్నాయని పేర్కొంటున్నారు.

కొన్ని సందర్భాల్లో కుట్లు సరిగా వేయకపోవడంతో తీవ్రంగా నొప్పి రావడం, కదిలినపుడు రక్తం కారడం జరుగుతోందని బాధితులు చెబుతున్నారు. ఆపరేషన్  తర్వాత క్రమం తప్పకుండా డ్రెస్సింగ్ సైతం చేయడం లేదని, మందులు సరిగా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కడుపునొప్పి వంటి జబ్బులకు చేసే ఆపరేషన్లు సైతం నిర్లక్ష్యంగా చేస్తున్నారని, గతవారం ఇలాంటి కారణంతోనే ఓ వృద్ధుడు మరణించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
నిర్లక్ష్యానికి నిదర్శనం..
సైదాపూర్ మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన జంగ మీన ప్రసవం కోసం భర్త ప్రసాద్ సహాయంతో ఆస్పత్రిలో చేరింది. 30న ఆపరేషన్ చేయడంతో మగ శిశువు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటోంది. గురువారం గైనకాలజిస్టు పరీక్ష చేసి కుట్లు విప్పారు. కుట్లు విప్పుతుండగానే నాలుగు పికిలిపోయి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆ పరేషన్ థియేటర్ వద్ద పడిపోయి బోరున విలపిం చిం ది. అయినా నాలుగు రోజులుగా చికిత్స అందించలేదు. చివరకు సోమవారం చికిత్స అందించారు.  
 
నిర్లక్ష్యానికి తోడు అపరిశుభ్రత..
రోగుల పట్ట డాక్టర్లు, సిబ్బంది అనుసరిస్తున్న తీరుకు ఆపరిశ్రుభత తోడవుతోంది. ఆస్పత్రి ఆవరణ, వార్డుతోపాటు పడకలు, బెడ్‌షీట్లు అపరిశుభ్రంగా ఉంటున్నా యి. ఇక వా ర్డుల్లోని టాయిలెట్స్ కంపు ఆస్పత్రి మొత్తా న్ని ఆవరించి ఉంటోంది. ఉన్నతాధికారులు స్పందించి వైద్యుల పని తీరును, ఆస్పత్రి పరిసరాలను మార్చాలని రోగులు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement