అగ్గిరాజుకుంటే.. బుగే | Sakshi
Sakshi News home page

అగ్గిరాజుకుంటే.. బుగే

Published Tue, Oct 21 2014 3:35 AM

అగ్గిరాజుకుంటే.. బుగే - Sakshi

ఫైర్‌సేఫ్టీ పై నిర్లక్ష్యం
సాక్షి, హన్మకొండ : జిల్లాలోని ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్ల వంటి జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో భవన యజమానులు అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు తనిఖీలు చేపడుతూ నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా జిల్లాలో అనేక భవనాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారుు. జుబేర్ బుక్‌స్టాల్ అగ్నిప్రమాదంతో అయినా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
ప్రమాదాలకు నిలయాలు
జిల్లాలో వేల సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా అనే భవనాలు వెలిశారుు. వరంగల్ నగరంలో వందకు పైగా ఫంక్షన్ హాళ్లు, 250 వరకు నివాస సముదాయాలు(అపార్ట్‌మెంట్లు), 250 పాఠశాలలు, 150 ఆస్పత్రులు, 20కి పైగా వాణిజ్య సముదాయాలు, 20 వరకు ఆటోమొబైల్ షోరూంలు ఉన్నాయి. వీటిలో 90 శాతం భవన నిర్మాణాల్లో ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మించారు. 2013 నవంబర్ నుంచి 2014 జులైవరకు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు భవన యజమానులు చేపట్టిన దాఖలాలు లేవని తేలింది. అధికారులు నోటీసులు జారీ చేయడంతో 20 ఆస్పత్రులు, 90 పాఠశాలలు, 20 ఫంక్షన్ హాళ్లు అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాయి. మిగిలిన భవన యజమానులు చర్యలు చేపట్టలేదు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండి పోయూరు.
 
భయపెట్టేందుకే..
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఫైర్‌సేఫ్టీ తనిఖీల పేరిట భవన యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆపై కుమ్మక్కై తదుపరి చర్యలకు ఉపక్రమించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే గతంలో చేపట్టిన తనిఖీల తర్వాత నోటీసులు ఇవ్వడం తప్ప కార్పొరేషన్ తరఫున కఠిన చర్యలకు ఉపక్రమించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. మరోవైపు ఆస్పత్రులు, పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సింది జిల్లా వైద్య ఆరోగ్య, విద్యాశాఖలది. ఆస్పత్రులు, పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖలకు లేఖ రాశామని కార్పొరేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు. కార్పొరేషన్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని వైద్య, విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రభుత్వ విభాగాల మధ్య కొరవడిన సమన్వయం వల్ల ఫైర్‌సేఫ్టీ అంశాలు మరుగున పడుతున్నాయి.

Advertisement
Advertisement