తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నిక | Sakshi
Sakshi News home page

తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నిక

Published Mon, Jun 16 2014 7:38 PM

New Committee for Telangana wrestling association

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ (కుస్తీ) అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ సమావేశం నల్లగొండలో జరిగింది. సమావేశంలో సంఘం రాష్ట్ర చైర్మన్ ఎంఏ.హఫీజ్‌ఖాన్, అబ్జర్వర్లు మక్బూల్ అహ్మద్, వైవీ.ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో సంఘం చైర్మన్‌గా డాక్టర్ ఎంఏ.హఫీజ్‌ఖాన్ (నల్లగొండ), అధ్యక్షుడుగా హాంజా బైనోమర్ (మెదక్), ఉపాధ్యక్షులుగా కె.కృష్ణ, నర్సింగ్‌రావు (రంగారెడ్డి), రాజేంద్రకుమార్ (నిజామాబాద్), సురేందర్‌యాదవ్ (హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా నాసర్ కాలీక్ (హైదరాబాద్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండీ.అస్లామ్ (వహబూబ్‌నగర్), జాయింట్ సెక్రటరీలుగా రాజలింగం (వరంగల్), పి.నర్సింగ్ (నిజామాబాద్), చంద్రయ్య (ఆదిలాబాద్), కోశాధికారిగా చంద్రారెడ్డి (మెదక్), కార్యవర్గ సభ్యులుగా సాజిద్‌ఖాన్, స్వామి (ఖమ్మం), రహీంఖాన్ (మహబూబ్‌నగర్), కె.జగదీశ్ (కరీంనగర్), నవాజ్ మొహీయొద్దీన్ (నల్లగొండ) ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement