ఈవీఎం ఎక్చేంజ్‌ | Sakshi
Sakshi News home page

ఈవీఎం ఎక్చేంజ్‌

Published Sun, Sep 16 2018 12:13 PM

New EVMS In Telangana Elections - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పు డు ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న పాత ఈవీఎంల స్థానంలో కొత్తవాటిని తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఈవీఎంల టెక్నాలజీ వీవీపీఏటీ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రాయల్‌)కి సపోర్టు చేయదు. దీంతో వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేసేలా అప్‌డేటెడ్‌ ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
 
ఈసీఐఎల్, బీఈఎల్‌లకు 3,400 ఈవీంలు 
ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ప్రత్యేక గోదాములు నిజామాబాద్‌లో ఉన్నాయి. గత ఎ న్నికల్లో  పోలింగ్‌ కోసం వినియోగించిన ఈవీఎం లను ఇందులో భద్రపరిచారు. మొత్తం 20,826 ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైదరాబాద్‌కు చెందిన ఈసీఐఎల్‌ సంస్థ తయారు చేసినవి కాగా, మరికొన్ని బెంగుళురులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. 

వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేయని వీటి స్థానంలో వీవీపీఏటీ యూనిట్లకు అనుసంధానించేలా అప్‌డేటెడ్‌ ఈవీఎంలను తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 3,400 ఈవీఎంలను ఆయా సంస్థలకు పంపారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాలకు వీవీపీఏటీ యూనిట్లు సపోర్టు చేయగల అప్‌డేటెడ్‌ ఈవీఎంలను తెప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,142 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వీటికి అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది.

పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో.. 
ఈవీఎంలో ఏ గుర్తు మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడుతుందనే అపోహ.. ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సం ఘం ఈ ఎన్నికల్లో వీవీపీఏటీ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించింది. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారనేది ఈ వీవీపీఏటీ యూనిట్లలో నిక్షిప్తం అవుతుంది. ఓటరుకు తన ఓటు ఏ గుర్తుకు వేశామనేది ఈ యూ నిట్‌లో కనిపిస్తుంది. ఓటు వేసిన అనంతరం 7 సెకన్ల వరకు ఈ సమాచారం ఓటరు అం దుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే పోలింగ్‌ అధి కారులను అడిగి కూడా తన ఓటు ఏ గుర్తుకు పడిందనేది ఈ యూనిట్ల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వీవీపీఏటీ యూనిట్లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఐదేళ్ల వరకు నిక్షిప్తంగా ఉం టుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement